Plane Colour Secrete: విమానం రంగు తెల్లగానే ఎందుకు ఉంటుంది? దీని వెనక ఉన్న అసక్తికరమైన కారణాలివే..!

|

Apr 11, 2022 | 6:54 AM

ప్రపంచ వ్యాప్తంగా చాలా విమానాలు తెలుపు రంగులోనే ఉంటాయి. మరి ఇవి ఎందుకు తెలుపు రంగులోనే ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా ఎయిర్‌లైన్‌లు విమానంపై తమ లోగో, ట్రేడ్‌మార్క్‌ని ఉపయోగిస్తాయి.

1 / 5
ప్రపంచ వ్యాప్తంగా చాలా విమానాలు తెలుపు రంగులోనే ఉంటాయి. మరి ఇవి ఎందుకు తెలుపు రంగులోనే ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా ఎయిర్‌లైన్‌లు విమానంపై తమ లోగో, ట్రేడ్‌మార్క్‌ని ఉపయోగిస్తాయి. కానీ దాని బేస్ కలర్‌ను ఎప్పుడూ ట్యాంపర్ చేయవు. శాస్త్రీయ, ఆర్థిక కోణాల్లో విమానాలకు తెలుపు రంగు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మరి విమానం రంగు తెల్లగా ఎందుకు ఉంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

2 / 5
విమానానికి తెలుపు రంగు వేయడానికి ప్రధాన కారణం సూర్య కిరణాలు. దాని తెలుపు రంగు కారణంగా సూర్యుని కిరణాలు పరావర్తనం చెందుతాయి. తద్వారా విమానం బాడీ ఉష్ణోగ్రత పెరగదు. తెలుపు రంగుకు బదులుగా మరొక రంగును ఉపయోగిస్తే.. విమానం సూర్య కిరణాలను పరావర్తనం చేయకుండా శోశిస్తుంది. దాంతో ఉష్ణోగ్రత పెరుగుతుంది.

3 / 5
మరో కారణం ఏంటంటే.. విమానానికి తెలుపు రంగు వేయడం వలన సోలార్ రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ కారణంగా విమానం వేడెక్కదు. అంతేకాదు.. విమానాలు గంటలతరబడి ఆకాశంలో ప్రయాణించడమే కాకుండా.. రవ్‌వే పైనా ఎండలో నిలిపి ఉంటాయి. తద్వారా ఎండ వేడిమి విమానాలపై పడుతుంది. ఆ ప్రభావం విమానాలపై పడకుండా ఉండేందుకే వాటికి తెలుపు రంగు వేస్తారు.

4 / 5
విమానాలు సాధారణంగానే చాలా ఎత్తులో ఎగురుతాయి. ఈ నేపథ్యంలో వాటి రంగు తెల్లగా లేకపోతే.. కాలక్రమేణా వాటి రంగు తేలిపోతుంది. ఇదే జరిగితే.. వాటి నిర్వహణ భారం అవుతుంది. ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా విమానయాన సంస్థ నష్టాలను చవిచూస్తుంది. ఆ నష్టాలను భరించడానికి టిక్కెట్ల ధరలను భారీగా పెంచాల్సి వస్తుంది. ఈ కారణంగా కూడా విమానాలకు తెలుపు రంగు వేస్తారు.

5 / 5
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. విమానం రంగు తెల్లగా ఉన్నప్పుడు దానికి ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే కనిపెట్టవచ్చు. దీనిని నిర్వహించడం కూడా చాలా సులభం. విమానాలకు తెలుపు రంగు వేయడం వలన పక్షులు కూడా వాటిని గుర్తించి ఢీకొట్టకుండా ఉంటాయి. తెలుపు రంగు కాకుండా వేరే రంగులు వేస్తే.. పక్షులు వాటిని గుర్తించడంలో విఫలమవుతాయట.