
అంతరిక్షంలో నీటి జాడ కోసం మనిషి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ విశ్వంలో మానవుడు ఒంటరి కాదని ఏదో గ్రహంపై జీవం ఉనికి ఉంటుందనే భావనలో ఉన్న శాస్త్రవేత్తలు ఆ దిశలో ప్రయోగాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సౌర కుటుంబంలో అతి పెద్ద చంద్రుడు, గురు గ్రహ ఉపగ్రహం ‘గనీ మీడ్’పై గత రెండు దశాబ్దాలుగా హబుల్ టెలిస్కోప్‌తో పరిశోధనలు చేస్తున్నారు.

తాజాగా ఈ టెలిస్కోప్ పంపించిన డేటాను విశ్లేషించిన నాసా శాస్ర్తవేత్తలు గనీమీడ్ క్రస్ట్ కింద సుమారు 100 మైళ్ల దూరంలో మహాసముద్రాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి భూమిపై కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ఉపగ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడంలో నీటిని కనుగొనడం ఒక కీలకమైన అడుగు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అయితే వేరే గ్రహాలపై నీటి జాడ దొరికినా వాటిపై మనిషి నివసించవచ్చా అంటే. అది అంత సులభమైన విషయం కాదని నాసా చెబుతోంది.