Dangerous Plants: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మొక్కలు ఏమిటో తెలుసా? ఇవి చేసే చెడు ఏమిటంటే..

|

Aug 21, 2021 | 8:56 PM

మొక్కలు.. చెట్ల గురించి ఆలోచన రాగానే మనకు సుందరమైన దృశ్యాలు గుర్తువస్తాయి. వాటి ఉపయోగాలూ మన మదిలో మెదులుతాయి. అయితే కొన్ని మొక్కలు ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. వాటిలో ఓ ఐదు మొక్కలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

1 / 5
1. మెషినిల్ చెట్టు: మధ్య దక్షిణ అమెరికాలో కనిపించే ఈ చెట్టు చాలా ప్రమాదకరమైనది, దాని పండును తినడం, దాని దగ్గరకు వెళ్లడం మానవుల మరణానికి దారితీస్తుంది. ఈ కారణంగా ఈ చెట్టును డెత్ ఆపిల్ అంటారు.

2 / 5
2. రోసరీ పీ: ఈ అందంగా కనిపించే చెట్టు చాలా ప్రమాదకరమైనది. దాని విత్తనాలు ఎర్రగా ఉంటాయి. కింద నల్లగా ఉంటుంది. దీనిని వాడుక భాషలో గురివింద గింజ అంటారు. ఇది పొరపాటున ఎవరైనా తింటే మరణమే శరణ్యం. ఇంతకు ముందు ఈ విత్తనాలను నగల తయారీకి ఉపయోగించినప్పటికీ, అది చాలా ప్రమాదకరమైనదని తెలిసిన తరువాత వినియోగించడం మానేశారు. 

3 / 5
3. గెయింట్ హాగ్వీడ్: బ్రిటన్‌లో కనిపించే ఈ మొక్క తెల్లని పువ్వులు చాలా అందంగా ఉంటాయి, కానీ ఈ పువ్వులను తినడం వల్ల చాలా మంది చనిపోయారు. దీనితో పాటు, ఈ పువ్వులు కళ్ళతో సంబంధంలోకి వస్తే అంధులు అయిపోతారు.

4 / 5
4. పాయిజన్ ఓక్ & ఐవీ: పాయిజన్ ఓర్..ఐవీని తాకితే మానవుల చర్మంపై బొబ్బలు లేదా ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. అనేక సందర్భాల్లో, దీని కారణంగా మానవులు మరణించారు కూడా. ఈ మొక్క మానవ చర్మానికి చాలా ప్రమాదకరమని నిరూపితం అయింది. 

5 / 5
5. సెర్బెరా ఓడోల్లం: ఈ మొక్కను సూసైడ్ ట్రీ అని కూడా అంటారు. కేవలం ఆత్మహత్యలు చేసుకోవడానికి మాత్రమే ప్రజలు ఈ మొక్కను ఉపయోగిస్తారు. అంటే, ఈ విషం ఏ శాస్త్రీయ పరిశోధనలోనూ ఇప్పటివరకూ ఏమిటనేది తేలలేదు. కానీ ఇది సమర్ధవంతంగా ప్రాణాలు తీస్తుందని రుజువు అయింది. 