
గోధుమ లేదా మల్టీగ్రెయిన్ పిండితో చేసే చపాతీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగవు. అంతేకాకుండా ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది.

లెక్కపెడితే ఇంట్లోకి లక్ష్మి దేవి వెనక్కి రాకుండా వెళ్ళిపోతోంది. మన ప్రవర్తన చాలా ముఖ్యం. కాబట్టి, అలా చేయకండి. ఇదే అలవాటు వేరే ఇంటికి వెళ్లిన కూడా ఇలాగే అలవాటు అవుతుంది. మంచి ఫుడ్ ఉన్నచోట ఆత్మవిశ్వాసం ఉంటుంది.

బియ్యంతో చేసే అన్నంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది. రాత్రి సమయంలో మన జీర్ణక్రియ నెమ్మదిగా పనిచేస్తుంది. అటువంటి సమయంలో త్వరగా జీర్ణమయ్యే అన్నం తినడం కడుపుకు చాలా తేలికగా ఉంటుంది. అలాగే ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడి, మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. అన్నం త్వరగా జీర్ణమైపోవడం వల్ల, తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేసే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట అన్నం మానేసి చపాతీ వైపు మొగ్గు చూపుతారు.

ఏది మంచిది? : ఆరోగ్య పరంగా చూస్తే అన్నం, చపాతీ రెండూ మంచివే. మీ శారీరక స్థితిని బట్టి ఎంచుకోవడం ముఖ్యం. అధిక బరువు లేదా షుగర్ ఉన్నవారు చపాతీని ఎంచుకోవడం ఉత్తమం. జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట అన్నం తినడం అనుకూలంగా ఉంటుంది.

ఈ రెండు ఆహారాలలో ఏది సులభంగా జీర్ణమవుతుంది? దేనికి ఎక్కువ సమయం పడుతుంది అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్నం జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ చపాతీ తినడం కూడా మంచిదే.