
అయితే వేసవి సమయంలో కొంత మంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్క ఎండకు ఎండిపోతుంది. దీంతో చాలా మంది బాధపడుతుంటారు. మొక్క ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ అద్భుతమైన చిట్కాలు, ఈ చిన్న సింపుల్ ట్రిక్ పాటిస్తే చాలు, ఎండిపోయిన మొక్క కూడా మళ్లీ గుబురుగా చిగురుస్తుందంట. ఇంతకీ ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

చాలా వరకు మనీ ప్లాంట్ వేసవిలో రంగు మారి, ఆకులు ఒకొక్కటిగా రాలి పోతుంటుంది. అయితే ఇటువంటి సమయంలోనే మొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా కొంత మంది ఇది ఏదో చెడు సంకేతం అని భావిస్తుంటారు. కానీ సమ్మర్‌లో మనీ ప్లాంట్ వాడిపోవడం సహజం అని చెబుతున్నారు నిపుణులు. అయితే వాడిపోయిన మొక్కను చిగురించేలా చేయడానికి డబ్బులు పెట్టి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ కొనకుండా ఇంటిలో ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందంట.

కలబంద ఆకును తీసుకొని దానిలో ఉన్న జెల్‌ను తీసుకొని దానిని శుభ్రంగా చేసి దానిని నీటిలో వేసి కలబంద జెల్ వాటర్ తయారీ చేసుకోవాలి. ఈ నీటిని మొక్క వేర్ల నుంచి, పై వరకు ప్రతి రోజూ స్ప్రే చేస్తూ ఉండాలి దీని వలన వాడిపోయిన మొక్క సహజంగా పోషకాలు అందుకొని, మళ్లీ చిగురించడం మొదలు పెడుతుంది.

అలాగే, ఎప్సమ్ సాల్ట్, ఇది మొక్కల్లో క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువలన అర లీటర్ నీటిలో ఈ ఉప్పు వేసి, దీనికి కలబంద జెల్ స్పూన్ కలిపి, ఒక్క రోజు రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత దీనిని స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి.

ఈ ద్రావణాన్ని ప్రతి రోజూ చెట్టుకు స్ప్రే చేయడం వలన మొక్క సహజంగానే చిగురిస్తూ ఉంటుందంట. వాడిపోయిన మొక్క కూడా మళ్లీ పచ్చగా మారి గుబురుగా పెరుగుతుంది.