
మీకు ఇష్టమైన ఫొటోలు కూడా ఆల్బమ్‌కు అతుక్కుపోయాయా? అయితే చింతించకండి. ఈ చిన్న ట్రిక్ ఫాలో అవుతూ మీ జ్ఞాపకాలను భద్రపరిచే ఫొటోలను ఇలా కాపాడుకోండి. వాటిని చెరగకుండా తీయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చాలా మంది తమ పాత ఆల్బ్ మ్ ఓపెన్ చేసే ముందు త్వర త్వరగా తీసేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. అది పాడై పోయి ఉంటుంది కాబట్టి, ప్రతి పేపర్ చాలా జాగ్రత్తగా తీయాలి.

మీకు చాలా ఇష్టమైన ఫొటోలను సరైన వెలుతురుకు వెళ్లి స్కాన్ చేసుకోవడం లేదా ఫొటోలు తీసుకోవడం చేయాలి. చాలా మంది ఫొటోలను లాగుతుంటారు. కానీ అలా చేయకుండా, ఒకదానికి మరకొటి వేరు చేస్తూ, చాలా మెల్లగా ఏవైనా పరికరాలను ఉపయోగిస్తూ మీరు మీ ఫొటోలను జాగ్రత్తగా తీసుకోవాలి.

ఆల్బమ్ నుంచి ఫొటోను వేరు చేయాలి అన్నప్పుడు ఫొటోను మొత్తం కాకుండా ఒకే మూల వైపు నుంచి మెల్లిగా తియ్యడం ప్రారంభించి, దానిని లోపలి నుంచి కదిలిస్తూ మెల్లగా తియ్యాలి. దీని వలన ఫొటో ఆల్బమ్ నుంచి చాలా త్వరగా వేరు చేయపడుతుంది.

ఒక వేళ మీకు ఇష్టమైన ఫొటోలు ఆల్బమ్‌కు చాలా గట్టిగా అతుక్కపోయి ఉంటే వాటిని తొలిగించడానికి లేదా వేరు చేయడానికి హెయిర్ డ్రైయర్‌ను కూడా ఉపయోగించవచ్చునంట. హెయిర్ డ్రయర్ తీసుకొని దానిని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో పెట్టి, కేవలం 10 సెకన్ల పాటు వేడిని ప్రయోగించాలి. దీని వలన ఫొటో మెల్లిగా వచ్చేస్తుంటుంది.

ఒక వేళ మీరు హెయిర్ డ్రయర్ ఉపయోగించే సమయంలో ఫొటో ముడతలు పడుతున్నట్లు అనిపిస్తున్నా, దాని రంగులో మీరు మార్పులు గమనించినా, వీలైనతం వరకు హెయిర్ డ్రయర్ ఉపయగించడం మానెయ్యాలి. అలాగే ఫొటోలపై ఉండే కవర్‌ను కూడా చాలా జాగ్రత్తగా తియ్యాలి. లేకపోతే అది ఫొటోపై మరకలు ఉండేలా చేస్తుంది.