కుస్తీలు పడే పనిలేదు.. ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!

Updated on: Sep 20, 2026 | 11:19 AM

చాలా ఇళ్ల గోడలు, బాల్కనీలపై లేదా గోడల పగుళ్లలో రావి చెట్టు మొలకలు పెరగడం మీరు చూసే ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కవుగా పెరుగుతూ ఉంటాయి. అయితే వీటిని చిన్నగా ఉన్నప్పుడే తొలగించకపోతే.. వాటి వేర్లు ఇంటి గోడల్లోకి చొచ్చుకుపోయి.. అవి బలహీనంగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని చిన్నప్పుడే తొలగించడం మంచింది. అయితే అసలు ఇవి ఎందుకు ఇంటిగోడపై పెరుగుతాయి. వాటిని ఈజీగా ఎలా తొలగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
హిందూ సాంప్రదాయంలో రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఇంటిపై పెరిగే ఈ చెట్లను తొలగించేందుకు చాలా మంది ఆలోచిస్తారు. అయితే మీరు నేరుగా మొక్కను నరికేయవద్దనుకుంటే.. ముందుగా మొక్క వేర్ల దగ్గర ప్రాంతాన్ని శుభ్రం చేసి, అక్కడకి నీరు చేరకుండా చేయాలి.. ఇస్తా చేసే మొక్క దానంతటదే బలహీన పడుతుంది. ఆ తర్వాత వాటి వేర్లను జాగ్రత్తగా తొలగించాలి. పొకపాటు కూడా వాటిని బలంగా లాగొద్దు. ఇలా చేస్తే గోడల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది.

2 / 5
వీటి తొలగించడానికి మరొక మార్గం ఏమిటంటే.. మన ఇంట్లో దొరికే ఇంగువ, పటిక కలిపిన ముద్దను వేర్ల దగ్గర పూయడం లేదా కాండాన్ని కత్తిరించి తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో వెనిగర్ పోయడం వంటి ఇతర పద్ధతుతో కూడా వాటిని తొలగించవచ్చు. అయితే ఇవి మొక్కను పూర్తిగా నాశనం చేయకపోయినా.. వాటిని పెరుగుదలను అడ్డుకోగలవు.

3 / 5
అయితే ఇంటి గోడలపై పెరిగిన ఇలాంటి మొక్కలను తొలగించడానికి కొందరు మార్కెట్‌లో దొరికే క్రిమిసంహాకర రసాయనాలను వాడుతూ ఉంటారు. కానీ ఇవి వాడేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొనే రసాయన డబ్బాల లేబుల్‌పై ఉన్న సూచనలను కచ్చితంగా పాటించాలి. అవి కొట్టిన ఒక రోజు వరకు ఇంట్లోని పిల్లలు, పెంపుడు జంతువులను అటువైపు వెళ్లనివ్వకూడదు.

4 / 5
మొక్కను పూర్తిగా తొలగించిన తర్వాత, ఆ ప్రాంతంలో ఏవైనా పగుళ్లు ఉన్నాయేమో లేదో పరిశీలించి.. చిన్న పగుళ్లను తగిన సీలెంట్ లేదా వాటర్‌ప్రూఫింగ్ మెటీరియల్‌తో మూసేయాలి. ఒక వేళ పగుళ్లు పెద్దగా ఉంటే వాటి తొలగించి కొత్త గోడను నిర్మించడం ఉత్తమం. అలాగే మీరు ఇప్పుడు తొలగించిన మొక్కల ప్లేస్‌లోకి మళ్లీ నీరు చేరకుండా చూసుకోవాలి.

5 / 5
ఈ సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఇంటిపై పెరిగే మొక్కలను తొలగించడంతో పాటు ఇంటి పరిసరాలను క్లీన్‌గా ఉంచుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో మీ ఇంటికి ఎలాంటి ముప్పులేకుండా కాపాడుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us