Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు

Updated on: Apr 14, 2026 | 7:07 PM

మీకు బ్యాంక్ పనులు ఉన్నాయా? బ్యాంక్‌కు వెళ్లాలని చూస్తున్నారా? అయితే వెళ్లే ముందు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వరుసగా రెండ్రోజుల పాటు బ్యాంక్‌లు మూతపడనున్నాయి. కాబట్టి ఏఏ రాష్ట్రాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో బ్యాంక్‌లు క్లోజ్ కానున్నాయో తెలుసుకోండి.

1 / 5
ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనుల కోసం వెళ్లే ముందు క్యాలెండర్‌ను ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెలలో జాతీయ సెలవులతో పాటు ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన సెలవుల ప్రకారం చూసుకుంటే ఈ నెల మొత్తంలో 10పైగా బ్యాంక్‌ హాలీడేస్ ఉన్నాయి.

2 / 5
అయితే కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు అనగా  ఏప్రిల్ 15 బుధవారం, 16వ తేదీ గురువారం బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. బుధవారం రోజు హిమాచల్ డే, విషు, పొహేలా బోయిషాఖ్ పండుగల కారణంగా కోల్‌కతా, కొచ్చి, షిమ్లా, గువహటిలో బ్యాంకులు మూతపడతాయి.

3 / 5
ఇక ఏప్రిల్ 16న అనగా గురువారం రోజు బొహాగ్ బిహు సందర్భంగా కోల్‌కతా, తిరువనంతపురంలో బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ప్రజల వీటిని బట్టి తమ ప్లాన్ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలాగే రాబోయే వారాల్లో కూడా బ్యాంక్‌లకు భారీగా సెలవులు ఉన్నాయి.

4 / 5
ఏప్రిల్ నెల రాబోయే వారంలోని బ్యాంక్‌లకు ఉన్న హాలీడేస్ వివరాలు చూసుకుంటే ఏప్రిల్ 19 ఆదివారం సాధారణ సెలవు, ఏప్రిల్ 20 - 21లో కర్ణాటక, త్రిపుర సహా  ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగల కారణంగా వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

5 / 5
ఇక ఏప్రిల్  చివరి వారంలో చూసుకుంటే మళ్లీ వరుసగా రెండ్రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి. ఏప్రిల్ 25 నాలుగవ శనివారం, ఏప్రిల్ 26 ఆదివారం సాధారణ సెలవు కావడంతో రెండ్రోజుల పాటు బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. వరుస సెలవుల కారణంగా మనీ విత్‌డ్రా లేదా చెక్కుల డిపాజిట్ వంటి పనులకు అంతరాయం కలగవచ్చు. కాబట్టి కస్టమర్స్ ఆర్థిక లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.

Follow Us