
తయారీ విధానంలోకి వెళితే. ముందుగా ఉడికిన అన్నం ఒక కప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో రెండు కప్పుల నీరు పోసి మెత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమం మొత్తం మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. నీరులా మారిపోవాలి. అప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో కొన్ని నీరు పోసి, పిండిని కలుపుకోవాలి. తర్వాత దీనిని అన్నం మిశ్రమంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలపకపోతే ఉండలు కడుతుంది. అందువలన మంచిగా కలిపి బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిని చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే రాగి సంగటి రెడీ.

ఇప్పుడు నాటు కోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం.. నాటు కోడి ముక్కలు, ఉల్లిపాయ, టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చింతపండు రసం, నూనె, ఉప్పు, కొత్తిమీర, పూదీన, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి.

తయారీ విధానం, ముందుగా నాటు కోడి చికెన్ తీసుకొని గోరు వెచ్చటి నీటిలో పసుపు, నిమ్మరసం కలిపి బాగా శుభ్ర పరచాలి. తర్వాత నీరు లేకుండా చూసుకొని, చికెన్‌లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, అందులో నూనె పోసి, బిర్యానీ ఆకు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కలిపి పక్కన పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిని మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసి, కొంచెం కారం, ఉప్పు వేసి, మరో 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.

ఇప్పుడు ముక్క కాస్త ఉడికిన తర్వాత అందులో గరం మసాలా, ధనియాల పొడి, వీలైతే ఎండు కొబ్బరి పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. మరో ఐదు నిమిషాలు ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర, పూదీన ఆకు వేసి మరో ఐదు నిమిషాలు స్టవ్ పై ఉంచి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నాటు కోడి, రాగిసంగటి రెడీ. మరి మీరు కూడా ప్రిపేర్ చేస్తారా?