
అనకాపల్లి జిల్లాలో విరబూసిన బ్రహ్మ కమలం కనువిందు చేసింది. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టలో వికసించింది బ్రహ్మకమలం. దేవాంగుల వీధిలో బూడిది శ్రీనివాస్ దంపతుల ఇంట్లో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. దీంతో అదృష్టంగా భావించిన ఆ కుటుంబం పుష్పానికి హారతి పట్టి పూజలు చేసింది. బ్రహ్మ కమలాన్ని చూసేందుకు తరలివచ్చారు గ్రామస్థులు..తెల్లని వర్ణంతో అందంగా వికసించిన బ్రహ్మ కమలాలను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ పుష్పాలు అరుదుగా పూయడంతో అదృష్టంగా భావిస్తున్నారు.

బ్రహ్మ కమలం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. రాత్రిపూట మాత్రమే వికసిస్తూ పరిమళం వెదజల్లుతుంది. ఆకర్షణీయమైన రూపం, దాని సువాసన కారణంగా హిమాలయాల రాణి, నైట్ క్వీన్ అని కూడా పిలుస్తారు. హిందూమతంలో బ్రహ్మ కమలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పుష్పం పెరట్లో పోస్తే ఆ ఇంటికి అదృష్టం తలుపు తడుతుందని నమ్మకం.

కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి దేవాలయాల్లో శివుడు విష్ణువులను ఈ పూలతో పూజిస్తారు. ఈ పుష్పాన్ని దర్శించుకునే భాగ్యం కలిగితే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఇంట్లో శ్రేయస్సు సానుకూల శక్తి వస్తుందని నమ్మకం. అలాగే బ్రహ్మ కమలం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు.. అద్భుతమైన ఔషధ గుణాలు కూడా కలిగి ఉందని చెబుతుంటారు.

ఈ పూలు, ఆకులు ఆయుర్వేదం టిబిటన్ వైద్యంలోనూ వినియోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా బ్రహ్మ కమలం ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుందని అంటారు. ఆర్థిక సంక్షోభం తొలగి లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క ఏంటి నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందనేది నమ్మకం.

ఈ మొక్క పెంచి భాగ్యం అందరికీ ఉండదట. ఎందుకంటే.. కొన్నిచోట్ల మాత్రమే ఈ మొక్క పెరుగుతుంది. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే మొక్కలకు అరుదుగా ఈ పూలు వికసిస్తాయి. అందుకే కేవలం ఈ మొక్కలను పెంచడమే కాదు.. ఆ పూలు వికసిస్తే దాని దర్శనం కూడా భాగ్యంగా భావిస్తారు. అందుకే ఆ అరుదైన దృశ్యం చూసేందుకు ఛాన్స్ వదులుకోరు.