
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

వచ్చే నెలలో రాహువు, శుక్రుడు ఎదురెదురు రానున్నాయి. దీని వల్ల రెండు రాశుల వారికి సంపద రెట్టింపు కానుంది. కెరీర్లో అధ్బుత మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు మనుసులో ఏం అనుకుంటే అది జరుగుతుంది. మీరు పని చేస్తున్న ఆఫీసులో ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు చేసే పనుల్లోస్నేహితులు తోడుగా ఉంటారు.

మీన రాశి: ఈ రాశి వారి జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. మీ ఊహకు కూడా అందని పెద్ద పెద్ద అవకాశాలతో జీవితం మొత్తం మారుతుంది. ఆర్థిక సమస్యలు నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఇంకా వీరి అప్పులు మొత్తం క్లియర్ అవుతాయి. మొత్తం వీరికి అనుకూలంగా మారుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ ఇంటి సభ్యులకు చెప్పి చేయండి. ఇంకా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు.

మిథున రాశి : మీరు మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో మనసులో కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇదే మంచి సమయం. స్నేహితులు కూడా మీకు మద్దతుగా ఉంటారు.ఇంకా మీకు సరిపోని వాళ్ళు మీ నుంచి దూరమవుతారు. దైవ బలం తోడుగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయాలేరు ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి సంతోషంగా గడుపుతారు. కొత్తగా వ్యాపారాలు మొదలు అధిక లాభాలు వస్తాయి. వీరి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.