రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప..

Updated on: Jun 30, 2026 | 7:16 AM

రాగి తోప ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే, మీరు దీనిని పాలతో కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేయోచ్చు. ఇది మాత్రమే కాకుండా పంచదారకు బదులు బెల్లం తీసుకుంటే దీనికి ఇంకా మంచి రుచి వస్తుంది. మీరు తినాలి అనుకుంటే నాలుగు బాదం, నాలుగు జీడిపప్పులను మిక్స్ చేసి ఆ పొడిని కూడా దీనిలో కలిపితే దీనికి మంచి రుచి వస్తుంది

1 / 5
రాగి రాగి తోప రెసిపీకి కావలసిన పదార్థాలు:  ఒక కప్పు రాగి పిండి, పావు కప్పు బెల్లం, రెండు కప్పుల నీరు , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 జీడిపప్పు , 10 కిస్‌మిస్ , రెండు టేబుల్ స్పూన్స్ తురిమిన కొబ్బరిని తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేసి తింటే రోజూ ఇదే తింటారు అంత రుచిగా ఉంటుంది.

2 / 5

రాగి తోప రెసిపీ తయారీ విధానం: ముందుగా బెల్లాన్ని తీసుకుని ఒక కప్పు నీటిలో దీనిని బాగా కరిగించి పక్కన పెట్టాలి. ఇంకా ఈ రాగి పిండిని అర కప్పు నీటితో ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసి కలుపుకోవాలి. పాన్ పొయ్యి మీద పెట్టి  బెల్లం నీటిని బాగా  మరిగించి దానిలో రాగి పిండి మిశ్రమాన్ని కొద్దీ కొద్దిగా వేస్తూ ఉండాలి.

3 / 5
రాగి తోప రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : అలాగే ఉండలు లేకుండా దీనిని కలుపుతూ మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం కొంచం గట్టిపడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా దీనిలో  తురిమిన కొబ్బరి కూడా వేసి కలపాలి. అలాగే 5  నిమిషాలు పాటు దీనిని కలుపుతూ మంచిగా ఉడికిస్తే రాగి కూడా టేస్ట్ వస్తుంది.

4 / 5
రాగి తోప రెసిపీ తయారీ విధానం స్టెప్ 3 : ఇప్పుడు చిన్న పాన్‌ తీసుకుని దానిలో కొద్దిగా  నెయ్యి వేడి చేసి 10 జీడిపప్పు, 10 కిస్‌మిస్‌ను గోల్డ్ కలర్లోకి  వచ్చే దాకా  వేయించాలి.ఆ తరవాత వేయించిన డ్రైఫ్రూట్స్‌ను, ఈ రాగి తోపలో వేసి గరిటెతో మంచిగా కలుపుకోవాలి.  ఇంకా చివర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇంకోసారి దీనిని మంచిగా కిందకు దించేయాలి.

5 / 5
అయితే, మీరు దీనిని పాలతో కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేయోచ్చు. ఇది మాత్రమే కాకుండా  పంచదారకు బదులు బెల్లం తీసుకుంటే దీనికి ఇంకా మంచి రుచి వస్తుంది. మీరు తినాలి అనుకుంటే నాలుగు బాదం,  నాలుగు జీడిపప్పులను మిక్స్ చేసి ఆ  పొడిని కూడా దీనిలో కలిపితే దీనికి మంచి రుచి వస్తుంది

Follow Us