
రాగి ఉప్మా: రాగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన రాగితో ఎలాంటి ఆహారాలు చేసినా అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే రాగితో ఉప్మా చేస్తే అదిరిపోతుందంట. కాగా, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, రాగి పిండి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ, మసాలాలు.

తయారీ లోకి వెళితే, ఒక బౌల్‌లో నీటిని తీసుకొని అందులో రాగి పిండి వేసి , చపాతీ పిండిని కలిపే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి నూనె పోసి, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో రాగి పిండి వేయాలి. దీనిని గరిటెతో బాగా కలపాలి. ఇలా పది నిమిషాలు ఉడకబెట్టకుంటే, పిండి దేనికి అది విడిపోయి, ఉప్మాలా అవుతుంది. అంతే రాగి ఉప్మా రెడీ.

రాగి చపాతీ : రాగి పిండితో చపాతీలు కూడా చేయవచ్చును. దీని కోసం ముందుగా రాగి పిండి, తురిమిన క్యారట్, పచ్చి మిర్చి, ఉప్పు, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర తీసుకోవాలి. వీటన్నిటినీ రాగి పిండిలో వేసుకొని చపాతీపిండి కంటే కొంచెం వదులుగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండితో కవర్ పై చేతితో లేదా రోటీ కర్రతో చపాతీలు చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి రోటీ రెడీ.

రాగి తీపి రొట్టే : రాగి పిండితో తియ్యటి చపాతీలు కూడా చేయవచ్చునంట. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టంగా తింటారు. దీని కోసం కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, కొబ్బరి పొడి, బెల్లం, రాగి పిండి, యాలకుల పొడి, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం వేసి కరగబెట్టాలి. అది నీరులా మారిన తర్వాత అందులో రాగి పిండి, యాలకుల పొడి, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి రాసి చపాతీల్లా తయారు చేసుకోవాలి. దీని తర్వాత ఈ రోటీని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి తీపి రొట్టే రెడీ.

రాగి దోసె : రాగి దోసె తయారు చేయడానికి రాగులు ఒక కప్పుడ, మినపప్పు, బియ్యం, పెసర్లు , వన్ టీ స్పూన్ మెంతులు. వీటన్నింటి దోసెలు వేయడానికి ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని పులియ బెట్టిన తర్వాత, దోసెలు వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి దోసెలు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.