పులస చేపలు సరిగా కుదరట్లేదా? అయితే కూర మధ్యలో ఇది వేయండి.. అసలుసిసలైన రుచితో

Updated on: Apr 18, 2026 | 8:12 AM

Pulasa chepala pulusu : పులస చేపలు ఒక్కోసారి సరిగా ఉడకవు దీని వలన కూర కూడా కుదరదు. అప్పుడు కూర మధ్యలో ఇది వేయండి అసలుసిసలైన రుచితో కంచాల మీద కంచాలు తింటూనే ఉంటారు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
పులస చేపల కూరకు కావాల్సిన  పదార్థాలు : అర కిలో చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు , రెండు టేబుల్ కొబ్బరి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు,  నిమ్మరసం వేసి 20 నిమిషాల పాటు ఉంచండి. ఇలా చేస్తే నీచు వాసన  పోతుంది.

3 / 5
ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసి అది కాగిన తర్వాత కరివేపాకు ఆకులు, నాలుగు పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్లోకి  మారే వరకు వేయించండి.

4 / 5
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మసాలా వాసన పోయే వరకు వాటిని బాగా వేపాలి.  టమాటాలు కూడా వేసి   ఉడికించాలి. కొద్దిగా కారం,  మాసాల పొడి, ఉప్పు వేసి మరిగించాలి. ఆ తరవాత చేప ముక్కలు కూడా వేసి మీడియం మంటపై మెత్తగా ఉడికించాలి.

5 / 5
కూర మధ్యలో చేపలు ఉడికేటప్పుడు కొద్దిగా చింతపండు కానీ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి పాలు కూడా కలపండి.
ఎందుకంటే, చింతపండు పులుపును ఇస్తుంది. కొబ్బరి త్వరగా ఉడికేలా చేస్తుంది. ఇవి కూరకు మరింత రుచిని ఇస్తాయి

కూర మధ్యలో చేపలు ఉడికేటప్పుడు కొద్దిగా చింతపండు కానీ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి పాలు కూడా కలపండి. ఎందుకంటే, చింతపండు పులుపును ఇస్తుంది. కొబ్బరి త్వరగా ఉడికేలా చేస్తుంది. ఇవి కూరకు మరింత రుచిని ఇస్తాయి

Follow Us