Balu Jajala |
Apr 10, 2024 | 5:34 PM
నటి ప్రియమణి డిఫరెంట్ రోల్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ బ్యూటీ "భామకళపం 2"తో పాటు "ఆర్టికల్ 370" అజయ్ దేవగన్ తో కలిసి నటించిన "మైదాన్" చిత్రాలలో అలరిస్తోంది.
అయితే ఒక నటి కెరీర్ కు వివాహం అడ్డంకి కాదని, కాని భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మార్పును చూడటం సంతోషంగా ఉందన్నారు. తన తోటి హీరోయిన్స్ నయనతార, సమంత రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్ లను ప్రశంసలతో ముంచెత్తింది.
పెళ్లి తర్వాత కూడా వీరంతా నటిస్తున్నారని, చాలామంది హీరోయిన్స్ అటు ఫ్యామిలీ, ఇటు యాక్టింగ్ తో రాణిస్తున్నారన్నారు.
అయితే పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ తల్లి, సోదరి, మరదలు వంటి పాత్రలకే పరిమితమవుతున్నారని, మరిన్ని లీడ్ రోల్స్ నటించాలన్నారు.
తమిళం, కన్నడంతో పాటు హిందీలో మరిన్ని ప్రాజెక్టులు రానుండటంతో ప్రియమణి కెరీర్ జట్ స్పీడుతో దూసుకుపోతోంది.