
విశాఖ పట్నంలోని ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికారు. వీరితోపాటు ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాస్, ఉన్నతాధికారులు ఉన్నారు.

యుద్ధనౌకల సమీక్ష-2026 కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి నేవీ అధికారులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఐ ఎఫ్ ఆర్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ మెస్‌లో విందు కార్యక్రమం జిరిగింది.

ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, ఈ ఎన్ సి చీఫ్ సంజయ్ భళ్ళా, వివిధ దేశాల నావికాదళ అధికారులు హాజరయ్యారు.

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందూ రాష్ట్రపతిని కలిసి ఫోటోలు కూడా దిగారు.

బుధవారం సాగర తీరంలో జరగనున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026 నేపథ్యంలో విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం ఈ సమీక్షకు హాజరుకానున్నారు. అలాగే గురువారం మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, శుక్రవారం ఐయాన్ కానైవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనున్నారు.