zodiac signs: శక్తివంతమైన రుచక రాజయోగం.. ఈ రాశులకు ఊహించని ధన లాభం

Updated on: Feb 04, 2026 | 5:42 PM

Ruchaka Raj Yoga: ఫిబ్రవరి నెల తొలి వారంలోనే రుచక రాజయోగం ఏర్పడింది. బుధుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలోకి కదులుతున్నారు. ఫలితంగా కుజుడు వచ్చే స్థితిలోకి వెళ్లి.. మకరరాశిలో రుచిక రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం మూడు రోజులపాటు ఉండనుంది. ఈ రాజయోగం వల్ల అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల మార్పులతో పలు యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనూ శక్తివంతమైన యోగం ఏర్పడింది. తాజాగా, ఏర్పడిన రుచక రాజయోగంతో కొన్ని రాశులవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే దౌత్యపరమైన ఆలోచనలతో అద్భుతమైన లాభాలు పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బుధుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలోకి కదులుతున్నారు. ఫలితంగా కుజుడు వచ్చే స్థితిలోకి వెళ్లి.. మకరరాశిలో రుచిక రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం మూడు రోజులపాటు ఉండనుంది. ఈ రుచిక రాజయోగం వల్ల అన్ని రాశుల వారికి ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని రాశులకు మాత్రం ఊహించని ధన లాభం వస్తుంది. ఈ రాజయోగం వల్ల అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల మార్పులతో పలు యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనూ శక్తివంతమైన యోగం ఏర్పడింది. తాజాగా, ఏర్పడిన రుచక రాజయోగంతో కొన్ని రాశులవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే దౌత్యపరమైన ఆలోచనలతో అద్భుతమైన లాభాలు పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బుధుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలోకి కదులుతున్నారు. ఫలితంగా కుజుడు వచ్చే స్థితిలోకి వెళ్లి.. మకరరాశిలో రుచిక రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం మూడు రోజులపాటు ఉండనుంది. ఈ రుచిక రాజయోగం వల్ల అన్ని రాశుల వారికి ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని రాశులకు మాత్రం ఊహించని ధన లాభం వస్తుంది. ఈ రాజయోగం వల్ల అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6

మేష రాశి.. 
మేష రాశి వారికి కెరీర్ పరంగా ఈ రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. రుచక రాజయోగ ప్రభావంతో పెండింగ్ పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అధికారం, మద్దతు అందుతుంది, అందువలన ఏవైనా సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది, స్నేహితుల సహకారం వల్ల కొన్ని పనులు చాలా సులభంగా పూర్తి అవుతాయి.

మేష రాశి.. మేష రాశి వారికి కెరీర్ పరంగా ఈ రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. రుచక రాజయోగ ప్రభావంతో పెండింగ్ పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అధికారం, మద్దతు అందుతుంది, అందువలన ఏవైనా సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది, స్నేహితుల సహకారం వల్ల కొన్ని పనులు చాలా సులభంగా పూర్తి అవుతాయి.

3 / 6

కన్య రాశి..
కన్యా రాశి వారికి రుచక రాజయోగ ప్రత్యేక లాభాలను తెస్తుంది. ఈరోజు నుంచి అదృష్టం మీతో ఉంటుంది, తద్వారా రెండు రోజులపాటు ప్రత్యేక లాభాలు దక్కే అవకాశం ఉంది. ఇష్టమైన స్నేహితులతో కలిసే అవకాశాలు, శత్రువుల నుంచి ప్రశాంతత, ఒత్తిడి తొలగిపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు.

కన్య రాశి.. కన్యా రాశి వారికి రుచక రాజయోగ ప్రత్యేక లాభాలను తెస్తుంది. ఈరోజు నుంచి అదృష్టం మీతో ఉంటుంది, తద్వారా రెండు రోజులపాటు ప్రత్యేక లాభాలు దక్కే అవకాశం ఉంది. ఇష్టమైన స్నేహితులతో కలిసే అవకాశాలు, శత్రువుల నుంచి ప్రశాంతత, ఒత్తిడి తొలగిపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు.

4 / 6

తులా రాశి..
తులా రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈరోజుల్లో అదృష్టం మీకు సహకరిస్తుంది, ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులు ప్రత్యేక ఫలితాలు పొందుతారు. ప్రత్యర్థులతో వాగ్వాదాలు తగ్గుతాయి, శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి.

తులా రాశి.. తులా రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈరోజుల్లో అదృష్టం మీకు సహకరిస్తుంది, ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులు ప్రత్యేక ఫలితాలు పొందుతారు. ప్రత్యర్థులతో వాగ్వాదాలు తగ్గుతాయి, శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి.

5 / 6

మకర రాశి
మకర రాశి వారికి ఫిబ్రవరి తొలివారం శుభప్రదంగా ఉంటుంది. రాజయోగ ప్రభావం వలన ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. గతంలో పూర్తికానిచ్చిన పనులు సులభంగా పూర్తవుతాయి. తల్లిదండ్రుల సహకారం, కొత్త ప్రారంభాల కోసం ఇది మంచి సమయం. అత్తమామల మద్దతుతో విశేష ఫలితాలు పొందవచ్చు.

మకర రాశి మకర రాశి వారికి ఫిబ్రవరి తొలివారం శుభప్రదంగా ఉంటుంది. రాజయోగ ప్రభావం వలన ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. గతంలో పూర్తికానిచ్చిన పనులు సులభంగా పూర్తవుతాయి. తల్లిదండ్రుల సహకారం, కొత్త ప్రారంభాల కోసం ఇది మంచి సమయం. అత్తమామల మద్దతుతో విశేష ఫలితాలు పొందవచ్చు.

6 / 6
కుంభ రాశి.. 
కుంభ రాశి వారికి ఈ సమయం చాలా శుభకరంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. ఏ పనిలోనైనా విజయాలు సాధించే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కొంత తగ్గుతాయి. తెలివితేటలతో ముందడుగు వేసినట్లయితే, వ్యాపారంలో, ఇతర పనుల్లో ఆశించిన విజయాలు సాధించవచ్చు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

కుంభ రాశి.. కుంభ రాశి వారికి ఈ సమయం చాలా శుభకరంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. ఏ పనిలోనైనా విజయాలు సాధించే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కొంత తగ్గుతాయి. తెలివితేటలతో ముందడుగు వేసినట్లయితే, వ్యాపారంలో, ఇతర పనుల్లో ఆశించిన విజయాలు సాధించవచ్చు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)