
తన ప్రచారంపై ఎన్నికల సంఘం 24 గంటల నిషేధం విధించినందుకు నిరసనగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ధర్నాకు దిగారు.

కోల్‌కతాలోని మయో రోడ్డులో గాంధీ విగ్రహం ఎదుట మంగళవారం ఉదయం 11.40 గంటలకు నిరసన చేపట్టిన దీదీ


సీఎం మమతా బెనర్జీ ధర్నాకు కూర్చున్న ప్రాంతం ఆర్మీకి సంబంధించిందని, దీనికి తాము ఎన్‌ఓసీ ఇవ్వలేదని ఈస్ట్రన్ కమాండ్‌కు చెందిన అధికారులు చెప్పారు

ఎన్నికల సంఘం నిర్ణయంపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామ్యకమని మండిపడ్డారు.