PM Vishwakarma: దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక భద్రత కోసం మోదీ సర్కార్ మరో కీలక అడుగును వేసింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విశ్వకర్మ యోజను.. ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తులు, కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం.. ప్రాచీన సంప్రదాయం, సంస్కృతి, విభిన్న వారసత్వాన్ని సజీవంగా, స్థానిక ఉత్పత్తులు, కళలు, సంపన్నంగా ఉంచడమే పీఎం విశ్వకర్మ స్కీం లక్ష్యం.