
ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడా చోటు చేసుకున్న స్వల్ప సంఘటనలు మినహా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

మొత్తం 7,220 ఏపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకూ 47.42 శాతం ఓటింగ్ జరిగింది.

ఎన్నికల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.