ఒంటరిగా ప్రయాణించాలని ఉందా ? టెన్షన్ వదిలేయండి.. సోలో ట్రావెలింగ్ కోసం భారత్‌లో టాప్ 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

Updated on: Jun 09, 2026 | 11:12 AM

నిత్యం బిజీగా ఉండే జీవితం నుండి కాస్త ఉపశమనం పొందడానికి, మనశ్శాంతి కోసం సోలో ట్రావెలింగ్ ఒక అద్భుతమైన మార్గం. అయితే, మొదటిసారి ఒంటరిగా వెళ్లేటప్పుడు భద్రత, రక్షణపై అనేక అనుమానాలు ఉంటాయి. వీటన్నింటికీ సమాధానంగా భారతదేశంలో ఒంటరిగా సందర్శించడానికి అత్యంత సురక్షితమైన, అందమైన 5 ప్రదేశాలను నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రదేశాల మీ ఒంటరి ప్రయాణికులకు (Solo Travelers) లైఫ్ చేంజింగ్ అనుభూతిని అందిస్తాయి. భారత్‌లోని బెస్ట్‌ 5 సోలో టూరిస్ట్‌ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
రోజువారీ ఉరుకుల పరుగుల జీవితం నుండి కాస్త విరామం తీసుకుని, మీ కోసం మీరు సమయం కేటాయించుకోవాలనుకుంటున్నారా? అయితే సోలో ట్రావెలింగ్ మీకు ఒక అద్భుతమైన ఆప్షన్. అయితే, మొదటిసారి ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మనసులో భయం, భద్రత గురించి కొన్ని అనుమానాలు ఉండటం సహజం. అలాంటి సమయంలో ప్రయాణానికి అనుకూలమైన, సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.  ప్రకృతి ఒడిలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, ఒంటరి ప్రయాణికులకు భారతదేశంలోనే అత్యంత సేఫ్, బెస్ట్ అయిన 5 ప్రత్యేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి..

2 / 6
మజూలి ఐలాండ్ (అస్సాం): మీరు సరికొత్త సంస్కృతిని, ప్రకృతిని అనుభవించాలనుకుంటే బ్రహ్మపుత్రా నది ఒడిలో ఉన్న మజూలి ద్వీపానికి వెళ్లాల్సిందే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఇక్కడి అస్సామీ సంస్కృతి, సాంప్రదాయ సత్రియా నృత్యాలు, పచ్చని ప్రకృతి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. పడవ ప్రయాణం, స్థానిక మఠాల సందర్శన మరియు గ్రామీణ జీవన విధానం మీ సోలో ట్రిప్‌ను మరువలేనిదిగా మారుస్తాయి.

3 / 6
వర్కలా (కేరళ): ప్రశాంతమైన సముద్రతీరంలో సేదతీరాలనుకునే వారికి కేరళలోని ‘వర్కలా’ బెస్ట్ ఛాయిస్. అరేబియా సముద్రం పక్కనే ఉండే ఎత్తైన కొండలు (Cliffs) ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ కొండలపై ఉన్న కెఫేల నుండి సూర్యాస్తమయాన్ని చూడటం, యోగా నేర్చుకోవడం ఇక్కడ చాలా ప్రసిద్ధి. రద్దీకి దూరంగా ఉంటూ రిలాక్స్ అవ్వడానికి సోలో ట్రావెలర్స్‌కు ఇది ఒక స్వర్గధామం.

4 / 6
హంపి (కర్ణాటక): యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి.. చరిత్రను ఇష్టపడే వారికి ఒక బహిరంగ మ్యూజియం లాంటిది. పురాతన శిల్పకళా వైభవం, తుంగభద్ర నది అందాలు ఇక్కడ మనల్ని కట్టిపడేస్తాయి. సోలో ట్రావెలర్స్ ఇక్కడ సైకిల్ లేదా బైక్ అద్దెకు తీసుకుని హాయిగా తిరగొచ్చు. సురక్షితమైన వాతావరణం, తక్కువ బడ్జెట్‌లోనే వసతి లభించడం వల్ల ఒంటరి ప్రయాణానికి ఇది ఎంతో అనుకూలం.

5 / 6
ఋషికేష్ (ఉత్తరాఖండ్): హిమాలయాల ఒడిలో, గంగా నది తీరాన ఉన్న ఋషికేష్ ఆధ్యాత్మికత, సాహసాల అద్భుత సంగమం. ఇక్కడి యోగా, ధ్యాన కేంద్రాలు మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి దూరం చేస్తాయి. ఒంటరిగా వచ్చే వారి కోసం ఇక్కడ ఎన్నో సురక్షితమైన ఆశ్రమాలు ఉన్నాయి. సాహసాలు ఇష్టపడే వారి కోసం రివర్ రాఫ్టింగ్, ట్రెకింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

6 / 6
 సౌత్ గోవా (గోవా): గోవా అంటే కేవలం రద్దీ, నైట్‌లైఫ్ మాత్రమే కాదు. మీకు మనశ్శాంతి కావాలంటే సౌత్ గోవాలోని పాలోలెం, అగోండా బీచ్‌లు సోలో ట్రావెలింగ్‌కు పర్ఫెక్ట్. ఇక్కడ స్కూటర్ రెంట్ తీసుకుని ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడి కెఫేలలో కొత్త వ్యక్తులతో మాట్లాడటం లేదా సముద్రతీరంలో పుస్తకం చదువుకుంటూ గడపడం సోలో ట్రావెలర్స్‌కు ఒక సరికొత్త స్నేహపూర్వక వాతావరణాన్ని అందిస్తుంది.

Follow Us