
పీరియడ్స్ వచ్చాయంటే చాలా మంది మహిళలు భయపడిపోతూ ఉంటారు. పీరియడ్స్‌లో ఆడవారి ఆలోచన కూడా మారిపోతుంది. లేడీస్ అందరికీ పీరియడ్స్ ఒకేలా ఉండదు. కొందరిలో చాలా నొప్పి, హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. బలహీనంగా, కళ్లు తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

ఒత్తిడి మీ రెగ్యులర్ పీరియడ్స్‌కు అంతరాయం కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు, 2 నెలల వరకు పీరియడ్స్ రాకుండా నిలిచిపోతాయి. ఈ ఒత్తిడి హార్మోన్ల వల్ల కూడా ఊబకాయానికి దారితీస్తుంది.

జీవనశైలి, ఆహారపుటలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల యువతను అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వాటిల్లో క్రమరహిత రుతుక్రమం ఒకటి. చాలా వరకు ఋతు చక్రాలు 28 రోజులు ఉన్నప్పటికీ, 21-35 రోజుల మధ్యలో వస్తుంటుంది. కానీ 35 రోజుల కంటే ఎక్కువ రోజులు పీరియడ్స్ ఆలస్యం అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి.

బాలాసనం వేయడం వల్ల కూడా పీరియడ్స్ సమస్యల నుంచి కాస్త ఊరట లభిస్తుంది. ఈ ఆసనాన్నే చైల్డ్ పోజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం కూడా చాలా సింపుల్. ఈ ఆసనం వేయడం వల్ల నొప్పి నుంచి అధిక రక్త స్రావం నుంచి ఊరట లభిస్తుంది.

ఈ ఆసనాలు వేయడంతో కూడా పౌష్టికాహారం తీసుకోవాలి. జ్యూసులు, గింజలు వంటివి తీసుకోవాలి. వీటి వలన బలంగా ఉంటారు. అలసట వంటివి దూరమవుతాయి. పీరియడ్స్‌లో పరి శుభ్రత పాటించాలి. ఇలా చేయడం వల్ల పీరియడ్స్ అనేవి బాధించవు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)