పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో.. ఈ ఫేషియల్‌తో టాన్ పోయి ముఖం దగదగా మెరవాల్సిందే!

Updated on: Aug 29, 2026 | 12:59 PM

దుమ్ము, దూళి, ఎండ కారణంగా ముఖంపై టానింగ్ ఏర్పడి చర్మం మెరుపును కోల్పోతుంది. ప్రతిసారీ దీనికోసం పార్లర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయడం అందరికీ కుదరకపోవచ్చు. అయితే మన వంటింట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో పార్లర్ తరహా కాంతిని, గ్లోను ఇంట్లోనే సులభంగా పొందవచ్చు. ఎలాంటి ఖర్చులు లేకుండా వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో 4 సులభమైన స్టెప్స్‌లో ఈజీగా ఈ ఫేషియల్ చేసుకోవచ్చు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం..

1 / 5
ఎండ, ధూళి, కాలుష్యం వల్ల ముఖంపై టాన్ ఏర్పడి కాంతిహీనంగా మారినప్పుడు పార్లర్‌కు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే సులభంగా ఫేషియల్ చేసుకోవచ్చు. వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో 4 సులభమైన స్టెప్స్‌లో ఈ ఫేషియల్ చేయవచ్చు. ఈ ఫేషియల్ విధానం ముఖంపై పేరుకుపోయిన మురికిని, డెడ్ స్కిన్ సెల్స్, నల్లటి మచ్చలను తొలగించి చర్మానికి మంచి మెరుపును, గ్లోను ఇస్తుంది.

2 / 5
కావాల్సిన పదార్థాలు: చల్లటి పచ్చిపాలు, బియ్యప్పిండి, తేనె, రోజ్ వాటర్, అలోవెరా జెల్, బాదం నూనె, శనగపిండి, పెరుగు, నిమ్మరసం, పసుపు. తీసుకోవాలి. ముందుగా ఒక కాటన్‌ బాల్‌ తీసుకుని చల్లటి పచ్చిపాలలో ముంచి ముఖం, మెడ భాగంలో బాగా తుడవాలి. దీనివల్ల చర్మంపై ఉన్న మురికి, దుమ్ము సులభంగా తొలగిపోతాయి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

3 / 5
స్క్రబ్బింగ్: ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై 5 నుండి 10 నిమిషాల పాటు తేలికపాటి చేతులతో మసాజ్ చేస్తూ స్క్రబ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్‌హెడ్స్‌ను సమర్థవంతంగా తొలగిస్తుంది.

4 / 5
మసాజ్ : ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ బాదం నూనె, ఒక చిటికెడు పసుపు కలిపి మృదువైన పేస్ట్‌ను తయారు చేయాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని వృత్తాకారంలో 7 నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇది రక్తప్రసరణను పెంచి చర్మానికి తక్షణ కాంతిని ఇస్తుంది.

5 / 5
ఫేస్ ప్యాక్: ఒక గిన్నెలో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి పట్టించి 20-25 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ సహజసిద్ధమైన ఫేషియల్ ద్వారా ముఖంపై ఉన్న టాన్ పూర్తిగా తగ్గిపోయి, చర్మం ప్రకాశవంతంగా, కోమలంగా మారుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us