
ఈ రెసిపీని ఆంధ్రాలో చాలామంది తింటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్. 60 ల్లో ఉన్న తాతలు బలంగా ఉన్నారంటే వీటి వలెనే. అప్పట్లో ఈ రొట్టెలను ఇష్టంగా తినే వాళ్ళు. ఆ వంటకం ఏదో కాదు.. దిబ్బ రొట్టె. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు దీనిలో ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జొన్న దిబ్బ రొట్టెకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న పిండి, కప్పున్నర బియ్యం రవ్వ, కప్పున్నర పెరుగు, మీడియం సైజ్ ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, 10 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ , కొత్తిమీరను తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో రెండు కప్పుల జొన్న పిండి, కప్పున్నర పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసి దీనిని మంచిగా కలపాలి. ఇంకా వీటిలో గ్లాసున్నర నీరు పోసి మళ్ళీ రెండోసారి దీనిని మంచిగా కలుపుకోవాలి. పిండి సరిగా కలపకపోతే ఇది మంచిగా రాదు.

జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం స్టెప్ 1 : మొత్తం కలుపుకున్న ఆ తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు , కట్ చేసిన కొత్తిమీర కూడా దీనిలో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా కలుపుకుంటే ఇది మంచిగా వస్తుంది.

జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం స్టెప్ 2 : గ్యాస్ పొయ్యి వెలిగించి దీనిలో నూనె వేసి, అది బాగా వేడయ్యాక ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. పెనం పెట్టి పిండిని మందంగా పోసుకోవాలి. ఇలాగే 10 నిమిషాల పాటు బాగా కాల్చాలి. ఇది ఒక వైపు కాల్చిన తర్వాత ఇంకో వైపు కూడా బాగా కాల్చుకోవాలి అంతే దిబ్బ రొట్టె రెడీ.