
తామరగింజల మసాలా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు: మూడు కప్పులు తామరగింజలు (మఖానా), అర కప్పు వేరుశెనగలు, పావు కప్పు పుట్నాల పప్పు , నాలుగు కరివేపాకు ఆకులు, 8 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండు మిర్చిని తీసుకోవాలి. అంతే కాదు దీనిలో సెపరేట్ గా ఒక టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలి.

తామరగింజల మసాలా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు: అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, మసాలా మిక్చర్ కు సరిపడా నూనెను తీసుకోవాలి.

తామరగింజల మసాలా మిక్చర్ తయారి విధానం: ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి తామరగింజలను నూనె ఒక్క చుక్క లేకుండానే 5 నిముషాలు పాటు మీడియం మంటపైనే బాగా వేయించుకోవాలి. అంతేకాదు మళ్ళీ పాన్ తీసుకుని పాన్‌లో నూనె చేసి దానిలో వేరుశెనగలను గోల్డ్ కలర్లోకి మారే వరకు బాగా వేయించి పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు అదే పాన్ లో నాలుగు వెల్లుల్లి, మూడు ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా కరకరలాడే వరకు వేయిస్తే సరిపోతోంది. ఇంకా దీనిలో పుట్నాల పప్పు కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలువుకోవాలి.

ఇక చివర్లో తామరగింజలు, వేరుశెనగలను కూడా పాన్‌లో వేసి మసాలాలు పట్టించాలి. ఇంకా దీనిలో సరిపడా ఉప్పు వేసి మూడు నిమిషాల పాటు మీడియం మంటపై వేయించాలి. చివరగా చాట్ మసాలా చల్లి దీనిని తినడమే. ఆ తరువాత దీనిని ఒక ప్లేట్ లోకి పెట్టుకుని ఉల్లిపాయతో తింటే మంచి టేస్ట్ ఉంటుంది.