
పెసరపప్పు ఉప్మాకు కావాల్సిన పదార్ధాలు : అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు , నాలుగు కరివేపాకు ఆకులు, సరిపడా నీరు, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

పెసరపప్పు ఉప్మా తయారి విధానం స్టెప్ 1: ముందుగా పాన్‌లో ఒక టీస్పూన్ నెయ్యి వేసి రవ్వను కూడా వేసి బంగారు కలర్లోకి వచ్చే రంగు వచ్చే దీనిని వేయించి పెట్టుకోవాలి.ఇంకోసారి ఈ పాన్ తీసుకుని దానిలో నెయ్యి, కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పెసరపప్పు , వీటితో పాటు మినప్పప్పును వేసి బాగా వేయించుకోవాలి.

పెసరపప్పు ఉప్మా తయారి విధానం స్టెప్ 2: 5 నిముషాలు తర్వాత దీనిలో అల్లం ముక్కలు లేదా తురుము , నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు , ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఇవి రంగు మారిన తర్వాత దీనిలో రెండు కప్పుల నీరు పోసి సరిపడా ఉప్పు కూడా వేసి ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి.

పెసరపప్పు ఉప్మా తయారి విధానం స్టెప్ 3 : మరుగుతున్న నీటిలో వేయించి పెట్టుకున్న రవ్వను, అర కప్పు పెసరపప్పును కూడా దీనిలో పోస్తూ ఇంకో మరో గరిటేతో కలుపుతూ పెట్టుకోవాలి. ఉండల ఉండలు లేకుండా ఉంటుంది. ఆ తర్వాత దీని మూతను చక్కగా పెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక చివర్లో కొత్తిమీర వేసి కిందకు దించడమే.

ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెడితే కచ్చితంగా తింటారు ఇది అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. పైన చెప్పిన రెసిపిని ఫాలో అయ్యి సరిగ్గా అదే కొలతలతో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది.