Nothing Phone (1): భారత మార్కెట్లోకి వచ్చేసిన నథింగ్‌ ఫోన్‌… ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

Jul 13, 2022 | 12:38 PM

Nothing Phone (1): ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తోన్న నథింగ్‌ (1) స్మార్ట్‌ ఫోన్‌ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇప్పటికే అధికారికంగా లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ తొలి సేల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21న ప్రారంభం కానుంది..

1 / 5
యూకేకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ నథింగ్‌ భారత మార్కెట్లో తన మొదటి స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నథింగ్‌ (1) పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ సేల్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21 నుంచి ప్రారంభం కానుంది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌ ఫ్లెక్సిబుల్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్‌10+, ఫోన్‌కు వెనకా ముందు కోర్‌నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 సపోర్ట్‌ అందించడం విశేషం.

3 / 5
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల చేశారు.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

5 / 5
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర వేరియంట్‌ను బట్టి రూ. 32,999 నుంచి రూ. 38,999కి అందుబాటులో ఉండనుంది.