
తడి తువ్వాలు: సమ్మర్‌లో సీలింగ్ ఫ్యాన్ కన్నా.. చాలా మంది ఎక్కువగా టేబుల్ ఫ్యాన్స్ వాడుతుంటారు. మీ దగ్గర కూడా టేబుల్ ఫ్యాన్ ఉంటే, దాని నుంచి వేడి గాలి వస్తుంటే.. మీ ఇంట్లో ఉన్న ఒక టవాల్ తీసుకొని దానిని నీటితో తడిపి.. ఆ చల్లని తువ్వాలును ఫ్యాన్ ముందు భాగంలో వేలాడదీయండి. ఇది ఎవాపరేటివ్ కూలింగ్ సూత్రంపై పనిచేస్తుంది. నీరు ఆవిరయ్యే క్రమంలో గాలిలోని వేడిని పీల్చుకుని, గాలిని చల్లగా, తేమగా మారుస్తుంది.

ఐస్ బాటిల్ ట్రిక్: ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న ట్రిక్ ఇది.. ఇందుకోసం మీరు మొదగటగా రెండు ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు నింపి ఫ్రీజర్‌లో గడ్డకట్టనివ్వండి. ఇవి ఐస్‌లా మారిన తర్వాత ఆ ఐస్ బాటిళ్లను తీసుకొచ్చిన మీ ఫ్యాన్ ముందు ఉంచండి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు, ఆ బాటిళ్ల చల్లదనం తగిలి గాలి ఏసీ లాగా చల్లగా వస్తుంది. ఐస్ లేకపోయినా, బాగా చిల్డ్ గా ఉన్న వాటర్ బాటిల్స్ కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇది కొద్ది క్షణాల్లోనే ఇంటిని చల్లగా మార్చేస్తుంది.

ఉప్పు, మంచు ముక్కలు: ఇది కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది యూజ్ చేస్తున్న ట్రిక్. ఇందుకోసం మీరు ప్రిజ్‌లోని ఐస్‌బార్ ద్వారా కొన్ని ఐస్ ముక్కలను తయారు చేయండి. వాటిని ఒక గిన్నెలో నిండా వేసి అందులో కొంచెం ఉప్పు కలపండి. ఆ బౌల్‌ను తీసుకొని మీ ఫ్యాన్ ముందు ఉంచండి. ఉప్పు కలపడం వల్ల ఐస్ త్వరగా కరగదు, దీనివల్ల ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఐస్ నుంచి వచ్చే చల్లదనం రూమంతా వ్యాపిస్తుంది. దీంతో రూమ్ మొత్తం చల్లబడుతుంది.

ఫ్యాన్ దిశను మార్చండి : ఈ ట్రిక్ గురించి చాలా మందికి తెలియదు. ఎప్పటిలాగా కాకుండా వేసవి కాలంలో సీలింగ్ ఫ్యాన్ కౌంటర్-క్లాక్ వైజ్ అంటే గడియారం ముల్లుకు వ్యతిరేక దిశలో తిరిగేలా చూసుకోవాలి. ఇలా తిరగడం వల్ల గాలి నేరుగా కిందికి నెట్టబడి మీకు చల్లదనాన్ని ఇస్తుంది. లేకపోతే ఫ్యాన్ నుంచి వచ్చే గాలి నేరుగా మనపైకి రాకుండా రూమ్ మొత్తం వ్యాపిస్తుంది. అప్పుడు మనం పూర్తి స్థాయిలో గాలిని ఆశ్వాసించలేము.

క్రాస్ వెంటిలేషన్ ముఖ్యం: సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. అలాగే మీ కిటికీల దగ్గర ఫ్యాన్ ఉంచడం వల్ల అది బయట ఉన్న చల్లని గాలిని లోపలికి లాగి, గదిలోని వేడిగాలిని బయటకు పంపుతుంది. తద్వారా మీ ఇల్లు చల్లబడుతుంది. అలాగే కిటికీలకు వేలాడదీసే కర్టెన్లపై నీళ్లు చిలకరించడం వల్ల కూడా గది ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. ఈ చిట్కాలతో భారీ ఏసీ బిల్లులు లేకుండానే మీరు ఈ వేసవిని తట్టుకోవచ్చు