వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి భారీగా పెరగనున్న వాటి ధరలు.. ఎంతంటే?

Updated on: Mar 15, 2026 | 2:11 PM

జాతీయ రహదారులపై ఎక్కవగా ప్రయాణాలు సాగించే వాహనదారులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి వార్షిక టోల్ పాస్ ధరను పెంచనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది.

1 / 5
నేషనల్ హైవేస్‌పై ఎక్కవుగా రాకపోకలు సాగించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక టోల్ పాస్ రేట్లను పెంచనున్నట్టు తెలిపింది. వచ్చి నెల 1వ తేదీ నుంచి ఈ పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

2 / 5
నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రూ.3,000గా ఉన్న వార్షిక టోల్ పాస్ ధరను ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రూ.3,075కి పెంచనున్నట్టు స్పష్టం చేసింది. అంటే గతంతో పోల్చుతే వాహనదారులు ఇప్పుడు అధికంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పాస్ యాక్టివ్, వర్కింగ్ ఫాస్టాగ్ ఉన్న ప్రైవేట్ వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.

3 / 5
NHAI కొత్త రూల్స్ ప్రకారం.. రూ.3,075 యాన్యువల్ పాస్ ఏడాది లేదా గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు మాత్రమే చెల్లుతుంది. అంటే మీరు ఏడాదిలో  200 సార్లు టోల్ దాటితే, మీ పాస్ వ్యాలిడిటీ గడువు ముగుస్తుంది. తర్వాత మీరు మళ్లీ కొత్త ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏప్రిల్ 1 నుంచి పెరగబోయే  కొత్త రేట్ల అమలు గురించి ప్రయాణికులు తెలియజేయాలని దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌ ప్లాజాలకు ఆదేశాలు జారీ చేసింది.

4 / 5
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకారం.. ప్రతి ఏడాది టోల్ రేట్స్ ను సమీక్షించి సవరించాలని.. ఇది సాధారణ ప్రక్రియలో భాగమేనని ప్రభుత్వం అంటోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా యాన్యువల్ పాస్ రేట్లను పెంచుతున్నట్టు తెలిపింది.

5 / 5
ఏడాది టోల్ ఫీజ్ ఎలా తీసుకోవాలి: మీరు ఎక్కువగా హైవైలపై ప్రయాణిస్తున్నట్లయితే మీకు ఈ యాన్యువల్ పాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక వేళ మీరు దానిని తీసుకోవాలి అనుకుంటే.. ముందుగా మీ వాహనం యాక్టివ్ FASTag కచ్చితంగా కలిగి ఉండాలి. మీరు దీన్ని తీసుకునేందుకు NHAI అధికారిక పోర్టల్ లేదా మీ FASTag జారీ చేసిన బ్యాంక్ యాప్‌లోకి లాగిన్ అయి.. అక్క వార్షిక పాస్ ఎంపికను సెలెక్ట్ చేసుకొని కావాలసిన వివరాలను ఫిల్ చేయండి తర్వాత అక్కడ చూపించిన పేమెంట్ చేస్తే మీ యాన్యువల్ పాస్ మీ FASTag IDకి లింక్ అవుతుంది.

Follow Us