
అరటి, పుచ్చకాయ: అరటిపండ్లను పొరపాటున కూడా ప్రిజ్‌లో పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. వీటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలని సూచిస్తున్నారు. అలా కాదని ఫ్రిజ్‌లో పెడితే పండు త్వరగా పాడవుతుందని.. అలాగే అరటిపండు విడుదల చేసే ఇథిలీన్ వాయువు వల్ల ఫ్రిజ్‌లోని ఇతర పండ్లు కూడా త్వరగా పండి పాడైపోతాయని చెబుతున్నారు. పుచ్చకాయ పెద్దగా ఉండడం వల్ల సంగం తిని చాలా మంది ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల అందులోని యాంటీఆక్సిడెంట్లు, పోషక విలువలు తగ్గిపోతాయని.. అందుకే పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టవద్దని నిపుణులు సూచిస్తుంటారు.

యాపిల్, బొప్పాయి: యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గపోతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరిగా ఫ్రిజ్‌లో పెట్టాల్సి వస్తే, పేపర్లో ప్రిజ్‌లో పెట్టాలి. బొప్పాయిని ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా దాని రుచి, ఆకృతి మారిపోతాయి. ఫ్రిజ్‌లోని చల్లదనం పండు పక్వానికి వచ్చే ప్రక్రియను అడ్డుకుంటుంది. కాబట్టి బొప్పాయి పూర్తిగా పండే వరకు ఫ్రిజ్‌లో పెట్టవద్దు.

పైనాపిల్, మామిడిపండ్లు: పైనాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడితే దాని రుచి, స్వభావం తగ్గిపోతుంది. ఫ్రిజ్‌లోని చల్లదనం పండును మరీ మెత్తగా మార్చి, దాని సహజసిద్ధమైన వాసనను దూరం చేస్తుంది. కాబట్టి పైనాపిల్‌ను గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మంచిది. మామిడిపండ్లను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎందుకంటే మామిడి వేడి లేదా గది ఉష్నోగ్రత వద్దే త్వరగా మాగుతుంది. ప్రిజ్‌లో పెడితే సహజమైన తీపి రుచి, గుజ్జు స్వభావం పూర్తిగా మారిపోతాయి.

అవకాడో: అవకాడోలను కూడా ఫ్రిజ్‌లో పెట్టరాదని నిపుణులు చెబుతున్నారు. చల్లని వాతావరణం వల్ల అవి పండటానికి సమయం ఎక్కువ పడుతుందని. ముఖ్యంగా పచ్చిగా ఉన్న అవకాడోలను ఫ్రిజ్‌లో పెడితే వాటి రుచి, ఆకృతి పాడైపోతాయి. వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందలేని చెబుతున్నారు.

నారింజ: వీటిని కూడా వీలైనంత వరకు ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రిజ్‌లో పెట్టడం వల్ల అవి ఎండిపోయి, వాటిలోని రసం, తాజాదనం తగ్గిపోతాయని.. అలాగే వాటిలోని సహజసిద్ధమైన సువాసన కూడా పోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా పండు రుచి చేదుగా లేదా విపరీతమైన పులుపుగా మారే ప్రమాదం ఉందని.. వీటిని ఎల్లప్పుడూ సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలని సూచిస్తున్నారు.