
ఈ ప్రకృతిలో మనకి తెలియని ఎన్నో రకాల కూరగాయలు ఉన్నాయి వాటిలో ఈ నేల ములక్కాయలు కూడా ఒకటి ఇవి నేల మీద పాకే తీగ అలాగే ఇవి నేల మీద పండుతాయి కాబట్టి వాటిని ఇలా పిలుస్తారు. ఈ తీగకు ముల్లు ఉంటాయి కాబట్టి, కోసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వీటిని కట్ చేసుకోవాలి ఇంకా దీనిని కూర వండుకుని తినొచ్చు. మసాలాలు వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది

నేల ములక్కాయలు, ఉల్లిపాయలు, టమాటాలు , ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, ఇంకా కూరకు సరిపోను నూనెను కూడా దీనిలో తీసుకోవాలి మీకు ఇంకా కారం కారంగా కావాలంటే పచ్చి మిర్చి కూడా దీనిలో వేస్తె స్పైసీగా ఉంటుంది.

ఇవి నేల మీద పండుతాయి కాబట్టి, వీటిని ఒకటికి రెండు సార్లు మట్టి పోయే వరకు వీటిని బాగా కడగాలి ఆ తరవాత వీటిని కూర చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టమాటాలతో చేసి తింటే ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు ఇంకా దీనిలో మసాలా పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి తింటే ఇంకా స్పైసీగా ఉంటుంది.

వాటికి ఉన్న ముల్లులు తీసేసి కడిగి పాన్ లో మగ్గించాలి ఆ తరవాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలను కూడా వేసుకోవాలి. కొద్దీ సేపటి తరవాత నూనె వేసి అది వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఆకులు , కొత్తిమీర వేసి బాగా వేయించాలి. ఇక మసాలా పొడి, కొత్తిమీరను వేసి దించి తినడమే. అంతే వేడి వేడి నేల ములక్కాయ రెడీ.

ఈ తీగలు పొలాల్లో ఉంటాయి కూలీ పనులు చేసే వాళ్ళు ఈ కాయలు కోసుకుని కమ్మగా వండుకుని రెండు పూట్ల తింటారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)