
మీ ఇంట్లోనే సులభంగా మీరు వేపాకు పేస్ట్ ను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఈ వేపాకులలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు, చర్మ సమస్యలను మొటిమలను తగ్గించడంలో ఇవి మంచిగా పనిచేస్తాయి. గజ్జి , ఎర్ర దద్దుర్లతో నిద్ర పట్టని వారు .. ఇది పూస్తే దురదలు మొత్తం మాయమవుతాయి.

కావలసిన పదార్థాలు: ఫ్రెష్ వేపాకులు: ఒక చిన్న కప్పు, నీరు: దీనికి సరిపడా , పసుపు: చిటికెడు (మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది). వీటిని తీసుకుని మీరు పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలి? ఎలా అప్లై చేసుకోవాలి అన్నది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఆకులను శుభ్రం చేయడం: మీరు మొదటగా ఫ్రెష్ వేపాకులను తీసుకొని, వాటికి ఉన్న దుమ్ము, ధూళి మొత్తం పోయే వరకు వీటిని మంచి నీటితో రెండు నుంచి 3 సార్లు బాగా శుభ్ర పరచుకోవాలి. ఇంకా బాగా కడిగిన వేపాకులను తీసుకుని కొంచం గోరువెచ్చని నీటిలో 5 నుండి 10 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఇలా చేయడం వలన ఆకులు మొత్తం మెత్తబడతాయి.

పేస్ట్ చేయడం: ఇప్పుడు మీరు నాలుగు ఆకులను తీసుకుని ఆ తరవాత నీటి నుండి తీసి రోలులో కానీ మిక్సీ జార్లో వీటిని వేసుకోవాలి. అలాగే, అవసరమైతే నాలుగు చుక్కల నీరు కూడా వేయాలి అలాగే రోజ్ కొద్దీ కొద్దిగా వాటర్ పోస్తూ, దీనిని మెత్తటి ముద్దలా నూరుకోవాలి. ఇంకా ఈ పేస్ట్‌లో తీసుకోవాలనుకుంటే దీనిలో చిటికెడు పసుపు ఇంకా కొద్దిగా పెరుగు కలుపుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి? తయారుచేసుకున్న వేపాకు పేస్ట్‌ను చర్మం పై ఎర్ర దద్దర్లు ఉన్న చోట మాత్రమే అప్లై చేయాలి. ఇది పూసిన తర్వాత 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇది రాసిన తరవాత మొత్తం ఆరిపోయే వరకు దీనిని అలాగే ఉంచాలి. కొద్దీ సేపటి తర్వాత మీరు చల్లని నీటితో మాత్రమే దీనిని మంచిగా శుభ్రపరచుకోవాలి.