నవరాత్రి స్పెషల్స్.. దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?

Updated on: Oct 13, 2026 | 4:55 PM

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. తొమ్మది రోజుల్లో తొమ్మది రూపాల్లో అమ్మవారు దర్శనం ఇస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ అమ్మవారికి తమకు నచ్చి ప్రసాదాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే మీరు కూడా అమ్మవారికి కొబ్బరి లడ్డూలు నైవేద్యంగా ప్రసాదించాలి అనుకుంటున్నారా? మరి వాటిని రుచికరంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5
పచ్చి కొబ్బరితో లడ్డూ ప్రిపేర్ చేస్తే రుచి అదిరిపోతుంది. అయితే దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏవో ఇప్పుడు  మనం వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు:  పచ్చి కొబ్బరి తురుము: 1 కప్పు,  పంచదార: 1/2 కప్పు,   నెయ్యి: 1 టీస్పూన్,యాలకుల పొడి: 1/2 టీస్పూన్,   మిల్క్ పౌడర్: 1 టీస్పూన్

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా పచ్చి కొబ్బరి చిప్పను తీసుకుని, దాని వెనుక భాగంలో ఉండే గోధుమ రంగు పొరను పూర్తిగా తీసివేయాలి.  తర్వాత, కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లోకి తీసుకుని, నీళ్లు కలపకుండా మెత్తగా తురుములా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి తురుము ఎంత ఉందో కొలుచుకోవాలి. సాధారణంగా ఒక కప్పు వరకు వస్తుంది.

3 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును పాన్ లో వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, కొబ్బరిని బాగా వేయించాలి. కొబ్బరిలో ఉండే పాలు పూర్తిగా ఇంకిపోయి, తురుము పొడిగా, డ్రైగా మారేంతవరకు కలుపుతూ వేయించడం చాలా ముఖ్యం. ఇలా వేయించడం వలన లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొబ్బరి మాడిపోకుండా చూసుకోవాలి. లేకపోతే లడ్డూ రుచి మారిపోతుంది.

4 / 5
కొబ్బరి తురుము బాగా వేగిన తర్వాత, అందులోకి అర కప్పు పంచదారను కలపాలి. కొబ్బరి సహజంగానే కొంత స్వీట్ గా ఉంటుంది కాబట్టి, అర కప్పు పంచదార సరిగ్గా సరిపోతుంది. పంచదార మొత్తం కరిగిపోయి, కొబ్బరి మిశ్రమం మళ్లీ దగ్గరపడేంతవరకు కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి, మిశ్రమం దగ్గరపడిన తర్వాత, చివరిగా అర టీస్పూన్ యాలకుల పొడిని, ఒక టీస్పూన్ మిల్క్ పౌడర్ ను కలపాలి. మీ వద్ద మిల్క్ పౌడర్ అందుబాటులో ఉంటే కలపవచ్చు, లేదంటే మానేయవచ్చు. అన్నింటినీ బాగా కలపాలి.

5 / 5
తర్వాత  మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.  స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే, కొబ్బరి మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, చిన్న చిన్న లడ్డులుగా చుట్టుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా లడ్డులుగా తయారు చేసుకోవాలి. అంతే రుచికరమైన కమ్మనైన కొబ్బరి లడ్డూలు రెడీ

Loading...
Unable to load recommendations.
Follow Us