
ఈ పచ్చడి తింటే విరిగిన ఎముకలను కూడా అతుక్కుంటాయి ఇంకా లేవలేనోళ్ళు కూడా లేచి పరుగులు పెడతారు. ;పాత రోజుల్లో ఈ కాడలు తెచ్చకుని మరి దీనిని బాగా తినేవాళ్లు దీనిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నల్లేరు కాడలు, పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ కారం, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకులు తీసుకోవాలి.

ముందుగా నల్లేరును కడిగి సిద్ధం చేసుకోవాలి: ముఖ్యంగా, నల్లేరు కాడలను బాగా బాగా శుభ్రపరచుకోవాలి. అలాగే, తీగలలు లాగా ఉంటాయి వీటిని తీసుకుని కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని దాని మీద ఉన్న పీచు తీసేసి కట్ చేసుకోవాలి. ఆ తరవాత వీటిని ఇంకో పాన్ లో బాగా వేయించుకోవాలి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా మగ్గించుకోవాలి

పచ్చి మిర్చి, టమాటాలతో చేస్తే ఎలా ఉంటాదో అలాంటి టెస్ట్ ఉంటుంది. వీటిని బాగా మగ్గించుకుని రోటిలో బాగా నూరుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్‌లో నూనె వేసి దానిలో పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత నల్లేరు కాడలను వేసి 10 మెత్తగా అయ్యేవరకు బాగా వేయించి రోటిలో దంచుకోవడమే .

అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యున్ని సంప్రదించి తినాలి (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)