Mutton Benefits: పార్టు పార్టుకో స్పెషాలిటీ.. మటన్‌లోని ఈ భాగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో!

Updated on: Feb 12, 2026 | 7:30 PM

నాన్‌వెజ్ అంటే ఇష్టపడని వారెవరుంటూ. చాలా మందికి వారంలో రెండు మూడు రోజులు ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇక నాన్‌వెజ్‌లో మటన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలా మంది చికెన్ లేదా ఫిష్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ తినడానికే ఎక్కువ ఇష్టపడుతారు. ఎందుకంటే మటన్‌లోని ఒక్కో పార్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అవి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే చాలా మంది మటన్ తినేందుకు ఇష్టపడుతారు. కాబట్టి మటన్‌లోని ఏ పార్టు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
మటన్.. ఇది రుచితో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వంటకం. మటన్‌లో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. మటన్‌లోని ప్రతి భాగానికి దాని స్వంత ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మటన్ లివర్, మటన్ తల, మటన్ కాళ్ళు, ఇలా అన్ని పార్టులు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కో పార్టు అందించే ప్రయోజనాలను క్లియర్ పరిశీలిద్దాం.

2 / 6
మటన్ లివర్: మటన్ లివర్‌ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మటన్ లివర్‌ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనతను సమర్థవంతంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా, ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

3 / 6
మటన్ బోన్‌ సూప్: మేక ఎముకలతో తయారు చేసిన సూప్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సూప్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జలుబు లేదా ఎముక బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

4 / 6
మేక తల: మేక తలలో కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ, ఇందులో ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని సాధారణంగా వేయించి, ముక్కలుగా చేసి, చపాతీ లేదా అన్నంతో తింటారు. ఎర్ర మాంసం ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మేక తల కూర తినడం వల్ల శరీరం బలపడుతుంది. అలాగే మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

5 / 6
మటన్ బోటి: మటన్ బోటి అంటే మేక పేగులు, వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, బి12, డి, ఇ, కె వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. మటన్ బోటిని ఉడికించిన లేదా వేయించిన కూరగా తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

6 / 6
NOTE: సాధారణంగా మటన్ తినడం వల్ల శరీరానికి విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మటన్‌ను సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కాని అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మటన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మటన్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే మటన్ అంటే అలర్జీ ఉన్న వారు మటన్ తినే ముందు వైద్యులను సంప్రదించండి.