
ఈ రోజుల్లో బియ్యం(అన్నం) తినకుండా జీవించడం అసాధ్యం. ఎందుకంటే మనమందరం జొన్న, సజ్జ, రాగులు మొదలైన వాటి కంటే బియ్యం మీదనే ఎక్కువగా ఆధారపడతాము. భారతదేశంలో బియ్యం అనేక విధాలుగా ఉత్పత్తి చేయబడతాయి. అలాగే, ఈ బియ్యం ధర కిలోకి 50 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. కానీ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం రకం ఒకటి ఉంది.. దీని వింటే నిజంగానే షాక్ అవుతారు. అంత డబ్బు పెట్టి కొంటారా..? అని ఆశ్చర్యపోతారు.

మీరు బియ్యం కొనడానికి మార్కెట్‌కు వెళ్ళినప్పుడు వాటి ధర కిలోకు సాదారణంగా రూ.30 నుండి 800 రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చు. అయితే, జపాన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం పండించే దేశం. ఇక్కడ దొరికే ఒక రకం బియ్యం ధర తెలిస్తే మీరు కంగుతింటారు. ఎందుకంటే ఆ బియ్యం ఖరీదు కికోకి 6,000 రూపాయల కంటే ఎక్కువ.

ఇంకా అన్నం కూడా పదే పదే వేడి చేసి తినొద్దు. ఇలా చేస్తే దానిలో ఉండే మంచి ప్రోటీన్స్ హానికర బ్యాక్టీరియాగా మారుతుంది. దీని వలన వాంతులు అయ్యే అవకాశం ఉంది.

జపాన్ కిన్మెమై ప్రీమియం బియ్యం 840 గ్రాముల బాక్స్ ధర 10,800 యెన్లు. అంటే, భారతీయ రూపాయలలో ఈ బియ్యం ధర 6,000 నుండి 7,000 రూపాయల మధ్య ఉంటుంది. ప్రస్తుతం వివిధ మార్కెట్లలో ఈ బియ్యం ధర కిలోకు 12,500 నుండి 15,000 మధ్య ఉంటుంది. ఈ బియ్యాన్ని వండడానికి కడగవలసిన అవసరం లేదు.

జపాన్ కిన్మెమై ప్రీమియం బియ్యాన్ని జపాన్ టోయో రైస్ కార్పొరేషన్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ బియ్యం అధిక పోషకాలతో కూడుకున్నవి. ఇందులో సాధారణ బియ్యం కంటే ఆరు రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్లు (LPS) ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బియ్యాన్ని జపాన్‌లోని ప్రత్యేక ప్రదేశాలలో పండిస్తారు.