Monthly Horoscope July 2024: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు

మాస ఫలాలు (జూలై 1 నుంచి జూలై 31, 2024 వరకు): మేష రాశి వారు ఈ నెలలో శుభ వార్తలు ఎక్కువగా అందుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మిథున రాశి వారికి కొన్ని కష్టనష్టాలు, సమస్యల నుంచి బయటపడి మానసికంగా ఊరట చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 30, 2024 | 10:17 PM

మాస ఫలాలు (జూలై 1 నుంచి జూలై 31, 2024 వరకు): మేష రాశి వారు ఈ నెలలో శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మిథున రాశి వారికి కొన్ని కష్టనష్టాలు, సమస్యల నుంచి బయటపడి మానసికంగా ఊరట చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలంతా శని, గురు, రవులు బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. కొత్త నిర్ణ యాలు, కొత్త ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి.  ఒకటి రెండు ధన యోగాలు పట్ట డానికి అవకాశం ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగడం, అనవసర ఖర్చులు బాగా తగ్గడం వంటివి జరుగుతాయి. పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహా రాలను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం వల్ల అనుకూలతలు మరింతగా పెరుగుతాయి.

2 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు, ధనాధిపతి బుధుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభి స్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనుల్ని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టపోతారు.  విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సాన్ని హిత్యం పెరుగుతుంది. సుందరకాండ పారాయణం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

3 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా ఉత్సాహంగా సాగిపోతుంది. కుజ, శుక్ర, బుధుల బలం అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని కష్టనష్టాలు, సమస్యల నుంచి బయటపడి మానసికంగా ఊరట చెందుతారు. ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండదు. ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఇంటా బయటా అంతా సానుకూలంగానే సాగిపోతుంది. ఉద్యో గంలో ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కొద్ది లాభాలతో ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబం మీద ఖర్చు పెరు గుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.  పిల్లలు వృద్ధిలోకి వస్తారు.  ప్రేమ వ్యవహా రాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల శత్రు జయం ఉంటుంది.

4 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): దశమ స్థానంలో కుజుడు, లాభ స్థానంలో గురువు ఉండడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి, శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయం క్రమంగా పెరుగు తుంది. ఆర్థిక అవసరాలు చాలావరకు తీరిపోతాయి. ఉద్యోగంలో పని భారం లేదా బరువు బాధ్య తలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి.

5 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి దశమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో కుజుడు ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో గుర్తింపు లభించి బిజీ అయిపోతాయి. కుటుంబ వాతావరణం కూడా చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగా సాగి పోతుంది. ఆస్తి వ్యవహారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది.  చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తరచూ శివార్చన చేయడం వల్ల శని ప్రభావం బాగా తగ్గుతుంది.

6 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో ఉండడం, భాగ్య స్థానంలో గురువు  ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. కొందరు సన్నిహితుల సహాయంతో వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని చాలావరకు చక్కబెడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధువుల వల్ల చిన్నా చితకా సమస్యలు ఉండవచ్చు. ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల శత్రు, రోగ, రుణ బాధలు తగ్గుతాయి.

7 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగపరంగా అనేక శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కలలో కూడా ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అంది ఆర్థిక బలం పెరుగుతుంది. ఈ నెలంతా గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. కొద్దిపాటి శ్రమ ఉన్నా ఆదాయ ప్రయత్నాలను విరమించే అవ కాశం ఉండకపోవచ్చు. కొందరు బంధుమిత్రులకు వీలైనంతగా ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఆశించిన ఫలి తాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విష్ణు సహస్ర నామం పఠించడం మంచిది.

8 / 13
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): లాభ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనేక విధాలుగా ఆర్థిక పురోగతి ఉంటుంది.  వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. అష్టమ స్థానంలో శుక్ర, రవుల సంచారం వల్ల చేతిలో డబ్బు నిలిచే అవకాశం ఉండదు. ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని గ్రహించాలి. రాశ్యధిపతి కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ప్రతి వ్యవహారం శ్రమ, తిప్పటతో గానీ పూర్తి కాదు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు బంధువుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకో కపోవడం మంచిది. విదేశాల ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.  ప్రేమ వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం మంచిది.

9 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శని, కుజ, శుక్ర గ్రహాల అనుకూల సంచారం కారణంగా జీవితాన్ని మలుపు తిప్పగల శుభ పరిణామాలు ఒకటి రెండు చోటు చేసుకుంటాయి. సంపద దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అయి విలువైన ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు చాలావరకు కుదుటపడతాయి. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పనులు, ప్రయత్నాలు, వ్యవహారాలు  కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది.  మీ సలహాలు, సూచనలు అధికారులకు ఉపయోగపడతాయి.  ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.  వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. సుందరకాండ పారాయణం మంచిది.

10 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రవి, రాహు, శని, గురువుల అనుకూలతల వల్ల నెలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పో తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. శని వక్రగతి ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆశించిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు. జీతభత్యాల విషయంలో కొద్దిపాటు అనుకూలతలు చోటు చేసుకుంటాయి. సహా యాలు, దానధర్మాల వల్ల ఆదాయం తగ్గే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయ త్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు కొద్ది శ్రమతో నెరవేరు తాయి.  వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తరచూ శివార్చన చేయడం వల్ల శీఘ్ర పురోగతి ఉంటుంది.

11 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో రాశినాథుడు శని వక్రించడం వల్ల అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దా నాలూ చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఎవరితోనూ ఎటువంటి ఒప్పందాలూ కుదర్చుకోవద్దు. కొద్ది కాలం పాటు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తప్పక పోవచ్చు. కొందరు తమ స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు.  ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆదిత్య హృదయం పఠనం వల్ల శుభ యోగాలు పడతాయి.

12 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ధన స్థానంలో కుజుడు, నాలుగు, అయిదు స్థానాల్లో బుధ, శుక్రుల సంచారం వల్ల ధనాదాయానికి లోటుండదు. ఆర్థికంగా ఒక విధమైన స్థిరత్వం లభిస్తుంది. ఖర్చులు బాగా తగ్గుముఖం పడ తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. నెలంతా వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు. అయితే, ఎవరితోనూ ఆర్థిక లావా దేవీలు పెట్టుకోకపోవడం మంచిది. దేనిలోనూ పెట్టుబడులు పెట్టవద్దు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు.  నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు రాణిస్తాయి. వ్యాపారంలో లాభాలు పరవాలేదనిపి స్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. దత్తాత్రేయ స్తోత్ర పఠనం మంచిది.

13 / 13
Follow us
మీ ఫోన్‌ కెమెరాతో మంచి ఫొటోలు తీయాలా.? ఈ టిప్స్ పాటించండి..

మరోసారి ఎన్నికలు.. అభ్యర్థులు కూడా వాళ్లేనా..?

హీరో బైక్, స్కూటర్ ప్రియులకు షాక్.. ఆ రెండు మోడల్స్ ధర పెంపు..?

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి

రాగి పాత్రతో పాదాలపై మర్దనా చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..

ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో లాభాల పంట..!
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో లాభాల పంట..!
దివ్య భారతి అదిరింది.. క్యూట్ గానే చంపేస్తోన్న కిల్లర్ బ్యూటీ..

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించాలా..? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

పోలికలు చూసి ఈపిల్లాడు ఎవరో చెప్పగలరా?టాలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో

మాటలకందని విషాదం.. తొక్కిసలాటలో 107 మందికిపైగా మృతి..