బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ వర్మ గుర్తున్నాడా..? ఈ 25 ఏళ్ల కుర్రోడు చేసేది చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ అయినా.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు
TV9 Telugu
సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘మన్ బైరాగి’తో అభయ్ తన కెరీర్ ప్రారంభించాడు. ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా అభయ్ కనిపించాడు. ఇందులో అభయ్ వేసిన పాత్ర కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నా.. అతడికి మంచి పేరు వచ్చింది
TV9 Telugu
తాజాగా వచ్చిన ‘ముంజ్య’ హారర్ కామెడీ మూవీతో భారీ హిట్ కొట్టాడు. అయితే ‘సఫేద్’ మూవీ షూటింగ్ సమయంలో తాను తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొన్నానని అభయ్ చెప్పుకొచ్చాడు
TV9 Telugu
‘ముంజ్య’ చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న అభయ్ వర్మ.. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తనకు జరిగిన ఓ షాకింగ్ సంఘటనని బయటపెట్టాడు
TV9 Telugu
సఫేద్ షూటింగ్ జరుగుతుండగా ఓ రోజు రాత్రి మెకప్‌తో హోటల్‌కి వెళుతున్నా. కొందరు తాగుబోతులు రోడ్డుపై ఎదురుపడ్డారు. హిజ్రా అనుకుని నన్ను అడ్డగించి.. నాతో అసభ్యంగా ప్రవర్తించారు
TV9 Telugu
నేను అబ్బాయిని అని చెప్పినా వదల్లేదు. పరిస్థితి చేయి దాటిపోయేసరికి చివరకు నిజం చెప్పాల్సి వచ్చింది. సినిమా కోసమే ఈ గెటప్ వేసుకున్నానని చెప్పాను. దీంతో వాళ్లు నన్ను వదిలేశారని అభయ్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు
TV9 Telugu
ఆ మువీలో ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తున్నప్పుడు పాత్ర ఫెర్ఫెక్షన్ కోసం ఆ గెటప్‌లోనే పలువురిని కలిసేవాడినని చెప్పుకొచ్చాడు. గతేడాది 'సఫేద్' మూవీలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు
TV9 Telugu
హర్యానాలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన అభయ్ వర్మ తండ్రి చిన్నప్పుడే మంచానికి పరిమితమయ్యాడు. దీంతో ఇల్లు తాకట్టు పెట్టి మరీ అభయ్ తల్లి పిల్లలను పోషించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డ అభయ్ 'సూపర్ 30' మూవీలో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు