వర్షాకాలంలో బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తున్నాయా? అద్భుతమైన చిట్కా ఇదే!

Updated on: Jun 14, 2026 | 7:19 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు , ఇంట్లో ఉండే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా చాలా మంది బట్టలు పిండటమే కాదు, పిండిన బట్టలు ఆరబెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని సార్లు అవి మంచిగా పిండినా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. దీంతో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి పిండిన బట్టలు బ్యాడ్ స్మెల్ రాకూడదు అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు.

1 / 5
వర్షాకాలంలో బట్టలు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే , తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. మీరు బట్టలు ఉతికే సమయంలో డిటర్జెంట్ వాడకం తగ్గించి,  వెనిగర్ లేదా కొంచెం డెటాల్ వేయాలంట. దీని వలన ఇవి బ్యాక్టీరియాను చంపేసి, వర్షాకాలంలో బట్టలు స్మెల్ రాకుండా చేస్తాయి.

2 / 5
అంతే కాకుండా బట్టలను వర్షం పడే సమయంలో చాలా సార్లు ఆరేయవలసి వస్తుంది. కానీ కొంత మంది వాటిని ఆరేయకుండా వాషింగ్ మెషిన్‌లో ఉంచేస్తుంటారు. దీని వలన బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువలన బట్టలలోని  నీరు మొత్తం పోయేలా చేసి, ఇంటిలోకి గాలి వచ్చే ప్రదేశంలో, కీటికీలు, డోర్ల దగ్గర బట్టలు ఆరేయాలి దీని వలన అవి త్వరగా ఆరిపోయి, స్మెల్ రాకుండా ఉంటాయి.

3 / 5
అంతే కాకుండా మీరు బట్టలు ఆరేసిన తర్వాత అవి పూర్తిగా ఎండి తేమగా ఉన్నా కూడా కొన్ని సార్లు స్మెల్ వస్తుంటాయి. అలాంటి సమయంలో కొంచెం తేమగా ఉన్న బట్టలను ఐరన్ చేయడం వలన దానిలోని తేమ పోయి, బట్టలు పూర్తిగా అరిపోతుంటాయి. ఇలా చేయడం వలన బట్టలు స్మెల్ లేకుండా శుభ్రంగా ఉంటాయంట.

4 / 5
అలాగే, బట్టలు ఉతికే సమయంలో సువాసన వెదజల్లే, కంఫర్ట్ లాంటివి ఈ సీజన్‌లో ఎక్కువగా వేయాలి. ప్రతి రోజూ తప్పకుండా వీటిని ఉపయోగించాలి. దీని వలన బట్టలు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి.

5 / 5
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన మీరు బట్టలను ఆరేసే చోట వాటి కింద గిన్నెలో రాగి ఉప్పు వేసి పెట్టాలి. దీని వలన అది తేమను గ్రహించి, బట్టలు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. అంతే కాకుండా ఎయిర్ కండీషనర్‌ ద్వారా కూడా బట్టలలోని తేమను తగ్గించవచ్చును.

Follow Us