Money Plant: మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు.. వెంటనే ఇలా చేయండి..

Updated on: May 01, 2026 | 5:58 PM

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలన్నా, సిరిసంపదలు సిద్ధించాలన్నా చాలామంది ముందుగా ఎంచుకునేది మనీ ప్లాంట్. అయితే కేవలం మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టేస్తే సరిపోదు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచకపోతే.. అది లాభానికి బదులు తీవ్రమైన ఆర్థిక నష్టాలను, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.

1 / 6
ఈశాన్య మూలలో పెడితే అప్పుల ఊబిలోకి: వాస్తు శాస్త్రం ప్రకారం. .ఇంటి ఈశాన్య మూల అత్యంత పవిత్రమైనది. కానీ, మనీ ప్లాంట్‌ను ఈ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈశాన్యంలో మనీ ప్లాంట్ ఉంటే ఇంట్లోని ఆదాయం అంతా అనారోగ్యాలకు, కోర్టు కేసులకు లేదా అనవసర ఖర్చులకే హరించుకుపోతుంది. దీనివల్ల యజమాని అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

2 / 6
బాత్రూమ్ దగ్గర పెడుతున్నారా?: చాలామంది ఇంటి అలంకరణ కోసం బాత్రూమ్ కిటికీల్లో లేదా దానికి దగ్గరగా మనీ ప్లాంట్లను ఉంచుతారు. వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పు. మనీ ప్లాంట్ శుక్ర గ్రహానికి ప్రతీక కాగా, బాత్రూమ్ రాహువు ప్రభావం ఉన్న ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల ఇంట్లోని ఆదాయ వనరులు క్రమంగా ఎండిపోయి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

3 / 6
బెడ్ రూమ్‌లో ఈ ప్రదేశం వద్దు: పడకగదిలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కొందరు భావిస్తారు. కానీ బెడ్ హెడ్‌బోర్డ్ దగ్గర దీనిని ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు, గొడవలు జరుగుతాయి. ఇది నిరంతరం ఒత్తిడిని, ఉద్రిక్తతను పెంచుతుంది.

4 / 6
చీకటి ప్రదేశాల్లో ఉంచితే కష్టాలు తప్పవు: మనీ ప్లాంట్ ఎక్కడైనా పెరుగుతుంది కదా అని చీకటి మూలల్లో లేదా వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచకూడదు. మనీ ప్లాంట్ ఎంత ఆరోగ్యంగా, వెలుతురులో పెరుగుతుందో.. మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతే బాగుంటుందని నమ్ముతారు. చీకట్లో పెరిగే మనీ ప్లాంట్ ఆర్థిక మందగమనానికి, కుటుంబంలో కష్టాలకు దారితీస్తుంది.

5 / 6
తీగలు నేలను తాకకూడదు..: మనీ ప్లాంట్ తీగలు పైకి పాకాలి కానీ ఎప్పుడూ కింద నేలను తాకకూడదు. తీగలు నేల మీద పారడం వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంట్లోకి సంపద రాకుండా అడ్డుకుంటుంది. అందుకే, తీగలు పైకి వెళ్లేలా ఒక కర్ర లేదా తాడు సహాయంతో ఆధారాన్ని కల్పించాలి.

6 / 6
మనీ ప్లాంట్ ఎక్కడ ఉంచితే మంచిది: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌కు ఆగ్నేయ మూల అత్యంత అనువైనది. ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు గ్రహం శుక్రుడు. ఇక్కడ మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరగడమే కాకుండా అదృష్టం కూడా కలిసివస్తుంది. కాగా మనీ ప్లాంట్ కేవలం అలంకరణ మొక్క మాత్రమే కాదు, అది మీ ఇంటి ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే శక్తి కలిగినది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి..

Follow Us