
మోదుగ చెట్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టులో ఉండే ప్రతి ఒక్కటీ కూడా మానవాళికి ఉపయోగపడుతుంది. దీనికి పెద్ద హిస్టరీనే ఉంది సంప్రదాయాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత పొందింది. అలాగే ఈ చెట్టు ఆకులు, పూలు, వేర్లు ఇలా అన్ని కూడా ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి.

మోదుగ విత్తనాలను ఆయుర్వేదంలో వాడుతారు. ఇవి కడుపులోని నులిపురుగులు హానికరం క్రిములను నాశనం చేయడానికి ఇవి చక్కగా పనిచేస్తాయి. ఇది మాత్రమే కాకుండా వేర్లు, బెరడు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా దీని వలన కడుపు నొప్పి , ఒంటి నొప్పులు మలబద్ధకంతో పాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. తగ్గిస్తాయి. కాబట్టి, మీరు కూడా ఒకసారి వీటిని తీసుకోండి కానీ, తీసుకునే ముందు వైద్యుని సలహాతోనే వాడండి.

విస్తరాకులు: ఎన్నో ఏళ్ల నుంచి ఆకుల్లో భోజనం తినడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆకులు ఏవో కావు మోదుగ ఆకులు వీటిని ఎండ బెట్టి దారంతో కుట్టి విస్తరాకులుగా చేసి కొందరు మార్కెట్లో అమ్ముతుంటారు. ఇలా ఈ ఆకులో తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పటికీ ఎన్నో శుభకార్యాల్లో, ప్రతి ఫంక్షన్లో వీటిని తప్పక తింటారు.

పూలు - రంగులు: మోదుగ పూలను కొందరు 'అగ్ని పూలు' అని పిలుస్తారు. ఇవి కూడా మనకి ఉపయోగపడతాయి. అయితే, వీటిని నీళ్ళలో బాగా ఉడకబెట్టి రంగుల తయారిలో ఉపయోగిస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. రంగులు చేసేటప్పుడు ఈ పూలు తప్పక ఉంటాయి.

పూజలు, వాస్తు: ఇంకా ఈ మోదుగ పూలను శివారాధనలో కూడా అత్యంత ముఖ్యమైనవి. ఇంకా హిందూవులు హోమం, పూజలలో ఈ మొక్కను నుంచే కలపను వాడుతారు ఇక ఆకులను అయితే బాగా వాడుతారు. అలాగే, వాస్తు దోషాలను ఇది తొలగిస్తుంది అందుకే దీనిని వేస్తారు.