చిన్నారులతో ఆడుకున్న ప్రధాని మోదీ ఫోటోలు వైరల్.. ఇంతకీ ఆ పిల్లలు ఎవరో తెలుసా..?

Updated on: May 25, 2026 | 9:48 AM

ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా కలిశారు. మోదీ తన అధికారిక హ్యాండిల్స్ లో పిల్లలతో ఉన్న చిత్రాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పని చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రామ్మోహన్ నాయుడు కుటుంబం ప్రధానికి కృతజ్ఞతలు తెలిపింది.

1 / 5
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడిపారు. చిన్న పిల్లలతో సరదాగా ఆడుకున్నారు. పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను మోదీ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. ఈరోజు ఇద్దరు యువ స్నేహితులు  న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం ఉన్న భారత దేశ సమీకృత పరిపాలనా సముదాయమైన సేవా తీర్థానికి వచ్చారని ఆయన పేర్కొన్నారు.

2 / 5
మోదీ ఇన్ స్టాలో ఈ ఫొటోలు షేర్ చేయగా ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరినీ ఈ ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి.  అందులో మోదీ చిన్న పిల్లాడిలా మారి వారితో ఆనందంగా గడిపారు.

3 / 5
ముఖ్యంగా ఆయన తన కార్యాలయంలో ఒక బల్లపై పసి బాలుడిని కూర్చో బెట్టుకొని, తనతో ఆడుకుంటూ నవ్వుతూ కనిపించారు. అలాగే రెండు చేతులతో ఆ చంటి పిల్లాడిని జాగ్రత్తగా పట్టుకొని, కాసేపు ఆనందంగా ఆ పిల్లాడితో గడిపాడు. తనతో దిగిన ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

4 / 5
అలాగే చంటి పిల్లాడే కాకుండా రెండు జడలు వేసుకున్న ఓ బాలిక ఉన్న ఫొటోలను కూడా ఆయన తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో బాలిక ఆయనకు ఒక చిన్న పుస్తకం లేదా కార్డును అందిస్తూ కనిపించింది. అలాగే, తనతో కాసేపు నిలబడి మాట్లాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

5 / 5
అయితే ఈ ఇద్దరు చిన్న పిల్లలు ఎవరో కాదు, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు కుమారుడు, కుమార్తె. శని వారం కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు తన ఎక్స్ పేజీలో ఒక నోట్‌ను పంచుకున్నాడు. అందులో ఇలా రాశారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే గౌరవం మా కుటుంబానికి లభించడం, నాకు, నాకుటుంబానికి ఇది నిజంగా చిరస్మరణీయమైన, భావోద్వేగభరితమైన క్షణం.ఆయన అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత మా కుటుంబంలోని మూడు తరాలను ఒకేలా ఆకట్టుకుంది. ప్రజల హృదయాల్లో ఆయన ఎందుకు అపారమైన ఆదరణ పొందారో ఆ క్షణంలో మరింత స్పష్టంగా తెలిసింది. తాను చూపిన ప్రేమ ఆప్యాయత మేము ఎప్పటికీ మర్చిపోము అంటూ ఆయన తెలియజేయడం జరిగింది.

Follow Us