సామల కిచిడీ ఇలా చేసి చూడండి.. నాన్ వెజ్ కర్రీలన్నీ కుళ్లుకోవాల్సిందే

Updated on: Mar 28, 2026 | 1:52 PM

samalu khichdi recipe: మిల్లెట్స్ చేసే ఏ వంటకం అయినా సరే రుచిగా ఉంటుంది. అలాగే, సామల చేసే కిచిడీ ఎంతో రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక డయాబెటీస్ ఉన్నవారికి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

కావాల్సిన పదార్దాలు:  సామలు, నాలుగు పచ్చి మిర్చి, 200 గ్రాముల బంగాళ దుంపలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు పల్లీలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి.

2 / 5
సామల కిచిడీ తయారీ విధానం: ఈ కిచిడీ తయారు చేయాలంటే ముందుగా సామలను తీసుకుని 5 గంటల పాటు నానబెట్టాలి. అలాగే, వీటిని రాత్రి పూటంతా  నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద  పాన్ పెట్టి పెట్టి ఆయిల్ లేదా నెయ్యి వేసి బాగా వేడి చేయాలి. అది  వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు కరివేపాకు ఆకులు  వేసి బాగా వేయించుకోవాలి.

4 / 5
ఆ తర్వాత పచ్చి మిర్చి ముక్కలు చేసుకుని, అలాగే బంగాళ దుంపలు , క్యారెట్ కూడా వేసి మగ్గించాలి. ఆ తర్వాత  ఉప్పు కూడా వేసి ముక్కలను బాగా వేయించాలి. కూరగాయలు ముక్కలు బాగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన సామలను కూడా వీటిని  మీడియం మంట మీద బాగా ఉడికించాలి.

5 / 5
సామలు ఉడకడం కోసం మూడు  కప్పుల నీళ్లు వేసి బాగా  ఉడికించాలి. కుక్కర్ రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఆ తర్వాత అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసి వడ్డించుకుని తినడమే.

Follow Us