Noche Buena Beer: ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో తెలుసా?

Updated on: Jan 02, 2026 | 6:50 PM

నార్మల్‌గా కొన్ని ప్రత్యేక మందు బాటిల్స్ కొన్ని షాప్స్‌లో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే అవి కాస్త కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడో దేశంలో అందరూ తాగే బీర్‌ను సంవత్సరానికి 15 రోజులు మాత్రమే విక్రయిస్తారట.అవును అది కూడా ఈ బీర్ ఆ ఒక్క పాంతంలోనే దొరుకుతుందట. ఇంతకు ఆ బీర్ ఏది.. దాని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం పదండి.

1 / 5
 మన దేశంలో సాధారణంగా గాంధీ జయంతి, ఆగస్ట్‌ 15, జనవరి 26 ఇలా కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే మద్యం దొరకదు.. మిగతా అన్ని రోజుల్లో దొరుతుకుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం సంవత్సరానికి 15 రోజులు మాత్రమే బీర్‌లు దొరుకుతాయట. అది కూడా కేవలం క్రిస్మస్ సెలవుల్లో మాత్రమే లభిస్తుందట, ఎందుకంటే దీనిని సాంప్రదాయకంగా క్రిస్మస్ రోజున లేదా ఆ సమయంలో మాత్రమే సేవిస్తారట. ఇది ప్రత్యేక బీరు కేవలం మెక్సికోలో మాత్రమే లభిస్తుందట.

2 / 5
BBC ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో క్రిస్‌మస్‌ పండుగను ప్రత్యేక పానియాలతో జరుపుకుంటారు. ప్యూర్టోరికో సాంప్రదాయం ప్రకారం అక్కడి ప్రజలు క్రీమీ, తీపి కోక్విటోనులతో జరుపుకుంటే.. జర్మనీలో కారంగా, వేడిగా ఉండే గ్లుహ్వీన్ (ముల్లెడ్ వైన్)ను జరుపుకుంటారు. అలాగే మెక్సికోలో మాల్ట్‌తో తయారు చేసిన బోక్-స్టైల్ బీర్‌తో క్రిస్‌మస్‌ వేడుకలను జరుపుకుంటారు.

3 / 5
 ఈ ప్రత్యేక బీరు మెక్సికోలో క్రిస్మస్ సెలవుల సమయంలో మాత్రమే లభిస్తుంది. దీని పేరు 'నోచే బ్యూనా', అంటే 'పవిత్ర రాత్రి' లేదా 'క్రిస్మస్ ఈవ్' అని అర్థం. ఈ ప్రసిద్ధ బీరు సాంప్రదాయకంగా సెలవులకు కొన్ని వారాల ముందు అమ్మకానికి వస్తుంది. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు. క్రిస్మస్ సమయంలో కూడా, ఇది మెక్సికోలో మాత్రమే లభిస్తుంది.

4 / 5
మెక్సికో సిటీలలోని సూపర్‌ మార్కెట్‌లలో ఈ నోచే బ్యూనా డబ్బాలు కనిపిస్తే క్రిస్‌మస్‌ సెలవులు వచ్చాయని అర్థం. టెకీలా! డిస్టిల్లింగ్ ది స్పిరిట్ ఆఫ్ మెక్సికో" అనే బుక్‌లో రచయిత్రి మేరీ సరితా గైటన్ ఇలా రాసుకొచ్చారు. ఈ బీరు రావడం అంటే మెక్సికోలో క్రిస్మస్ సెలవులు ప్రారంభమయ్యాయని అర్థమని పేర్కొన్నారు.

5 / 5
1924లో, జర్మన్ మాస్టర్ బ్రూవర్ ఒట్టో న్యూమాయర్ అనే యూరోపియన్ క్రిస్మస్ సందర్భంగా తనకు, తన స్నేహితుల కోసమని ఒక ప్రత్యేక బీరును తయారు చేశాడు. తరువాత దానిని తన సహోద్యోగులు, వారి కుటుంబాలతో పంచుకున్నాడు. అయితే దీని ప్రత్యేక రుచి వాళ్లకు ఎంతగానో నచ్చింది. 1938లో, ఒరిజాబా బ్రూవరీ సెలవుల కాలంలో నోచే బ్యూనాను ప్రజలకు ప్రత్యేక పానీయంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే దీనికి క్రిస్మస్-ప్రేరేపిత పేరు వచ్చింది. అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.