
మీతి బూందీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు సెనగపిండి, రెండు గ్లాసుల నీరు, అర టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక కప్పు చక్కెర , ఒక గ్లాస్ నీరు , అర టేబుల్ స్పూన్ యాలకల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి.

మీతి బూందీ తయారీ విధానం: ముందుగా పిండిని సిద్ధం రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ పిండిలో నీరు వేసి పలుచగా కాకుండా పిండిని కలువుకోవాలి. ఇంకా ఇది మెత్తగా ఉండకూడదు. పిండి మరి జోరుగా అయితే, బూందీ మంచిగా రాదు కాబట్టి దీనిలో అస్సలు ఎక్కువ నీరుపోయకండి. మీరు ఇంట్లో చేసేటప్పుడు ఇది అస్సలు మర్చిపోకండి

బూందీని ఇలా వేయించుకోవాలి: గ్యాస్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి బాగా వేడి చేయాల. ఇది వేడి అయ్యాక బూందీ జల్లెడను తీసుకుని పిండిని పోసి నూనెలో చల్లుతూ ఉండాలి. ఇవి కింద పడినప్పుడు చిన్న చిన్న బూందీలుగా అవుతాయి. వాటిని బంగారు కలర్లోకి వచ్చే వరకు వేయించాలి

పాకం ఇలా తయారు చేసుకోవాలి: పాన్‌లో పంచదార, నీరు వేసి బాగా మరిగించాలి. పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఆ తరవాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి, కుంకుమపువ్వు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మరి, ముదురు కాకుండా లేత పాకం లాగా చేసుకోవాలి. ఇలా చేస్తే బూందీ టేస్టీగా ఉంటుంది

వేడి బూందీని పాకంలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచితే పాకం బాగా పట్టుతుంది. ఇంకా ప్రతి మంగళవారం రోజున మీతి బూందీ చేసి హనుమాన్కు నైవేద్యం పెడితే మీ జీవితం మారిపోతోంది. మీరు మనసులో అనుకున్న కోరికలు కూడా నెరువేరుతాయి.