
మంగళం, సూత్రం రెండు పదాల కలయికే మంగళసూత్రం. శుభం, శుభకార్యం.. దారం అని ఈ పదాలకు అర్ధం. ఈ రెండు పదాల కలయికతో ఏర్పడే మంగళసూత్రం ఒక శుభదాయకమైన దారంగా అర్థం. ఇది ప్రధానంగా పసుపు, బంగారు గొలుసుతో కూడిన, రెండు తాళిబొట్టులు కలిగిన ఒక దండలా ఉంటుంది. పెళ్లి సమయంలో వరుడు, వధువుకి మంగళసూత్రం ధరింపజేస్తాడు. ఇది వివాహ బంధం ప్రారంభమైనదని చెప్పే చిహ్నం.

హిందూ మతంలో మంగళసూత్రానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. దీనిని శుభకరమైన చిహ్నంగా పరిగణిస్తారు. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను సూచిస్తుంది. అయితే చాలా మంది మహిళలు తరచుగా మెడలో మంగళసూత్రంకి సేఫ్టీ పిన్నులు పుడుతుంటారు. అయితే ఇది మత విశ్వాసాల ప్రకారం ఇది అశుభం.

హిందూ మతంలో మంగళసూత్రానికి చాలా పవిత్రమైన,ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భారతీయ సంస్కృతిలో, మంగళసూత్రాన్ని అదృష్టాన్ని తెచ్చే వస్తువుగా భావిస్తారు. మంగళసూత్రం ధరించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, నిబద్ధత చెక్కుచెదరకుండా ఉంటుందని చెబుతారు.

రెండు బంగారు గిన్నెలు, నల్ల పూసలతో తయారు చేయబడిన మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఇది భారతీయ స్త్రీకి స్త్రీ సంపద కూడా. కానీ చాలా ఇళ్లల్లో తల్లులు, అమ్మమ్మలు మంగళసూత్రంలో సేఫ్టీ పిన్ను పెట్టడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ సాంప్రదాయ నమ్మకాల ప్రకారం పవిత్రమైన మంగళసూత్రంలో సేఫ్టీ పిన్ను పెట్టడం అశుభమని భావిస్తారు. మంగళసూత్రంలో సేఫ్టీ పిన్ను పెట్టడం భర్త పురోగతికి ఆటంకం కలిగిస్తుందని చెబుతారు.

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం కేవలం హిందు మత విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే. దీనిని టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ధృవీకరించడంలేదు. ఏదైనా సందేహం ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం కేవలం హిందు మత విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే. దీనిని టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ధృవీకరించడంలేదు. ఏదైనా సందేహం ఉంటే నిపుణులను సంప్రదించగలరు.