మల్కాజిగిరిలో పోలీసుల మెగా ఆపరేషన్.. 54 చెక్‌పోస్టులు, 1,098 మంది సిబ్బందితో విస్తృత తనిఖీలు!

Edited By:

Updated on: Oct 24, 2026 | 7:55 PM

నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సీల్-Mలో భాగంగా అక్టోబర్ 22, 23 తేదీల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మూడు జోన్ల పరిధిలో ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొత్తం 54 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 1,098 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

1 / 5

2 / 5
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు 3,617 వాహనాలు, 3,448 మంది వ్యక్తులను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 365 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు, ఈ-చలాన్లు నమోదు చేయగా.. డ్రంకెన్ డ్రైవ్‌కు సంబంధించి 28 మందిపై కేసులు నమోదు చేశారు. వివిధ కారణాలతో 126 వాహనాలను సీజ్ చేయడంతో పాటు మరో 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.

3 / 5
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మూడు జోన్లలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఎల్‌బీ నగర్ జోన్‌లో అత్యధికంగా తనిఖీలు చేపట్టారు. ఈ జోన్ పరిధిలో 1,392 వాహనాలు, 1,111 మంది వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 20 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 57 పెట్టీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మరోవైపు నగదు, మద్యం, డ్రగ్స్, ఆయుధాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలో వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 118 పెట్టీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం. రాత్రి వేళల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెంచడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.

4 / 5
ఇదిలా ఉండగా.. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అనుమానాస్పద సరుకు రవాణా వాహనాన్ని గుర్తించారు. ఎస్‌వీకే లాజిస్టిక్స్‌కు చెందినదిగా భావిస్తున్న నాలుగు చక్రాల వాహనంలో 67 కన్సైన్‌మెంట్ బాక్సులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆ సరుకుకు సంబంధించిన పత్రాలను డ్రైవర్ చూపించకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ బాక్సుల్లో ఉన్న సరుకు ఏమిటి? రవాణాకు అవసరమైన పత్రాలు ఎందుకు లేవు? అనే అంశాలపై విచారణ జరగాల్సి ఉంది. ఆభరణాల రవాణా వ్యాపారానికి సంబంధించిన చట్టబద్ధతపైనా స్పష్టత రావాల్సి ఉంది.

5 / 5
మొత్తంగా అంతర్‌ కమిషనరేట్ సరిహద్దుల్లో నిఘా పెంచడం, అనుమానితులను గుర్తించడం, అక్రమ రవాణా, మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాల కదలికలను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ సీల్-M నిర్వహించారు. ఒకేసారి మూడు జోన్లలో విస్తృత తనిఖీలు చేపట్టి వాహనదారులు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంతో పాటు అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us