స్టవ్‌పై మొండి మరకలు వదలట్లేదా?.. టెన్షనొద్దు.. ఇలా క్లీన్ చేస్తే క్షణాల్లో తలతల మెరవాల్సిందే!

Updated on: Apr 16, 2026 | 7:22 AM

Kitchen Hacks: ప్రతిరోజూ వంట చేయడం వల్ల గ్యాస్ స్టవ్ మరియు బర్నర్‌లు జిడ్డుగా, మురికిగా మారుతుంటాయి. పాలు పొంగడం, నూనె మరకలు వంటివి పేరుకుపోయి బర్నర్ రంధ్రాలు పూడుకుపోతే గ్యాస్ మంట సరిగ్గా రాదు. అటువంటి సమయంలో ఈ కింది చిట్కాలను పాటించి బర్నర్‌లను సులభంగా మెరిపించవచ్చు. అదెలానో చూద్దాం పదండి.

1 / 5
బేకింగ్ సోడా, నిమ్మరసం: ఇవి మొండి మరకలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా  పనిచేస్తాయి. ఇందుకోసం ఒక పాత్రలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో 2-3 చెంచాల బేకింగ్ సోడా ,ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. ఈ మిశ్రమంలో బర్నర్‌లను 30 నిమిషాల నుండి గంట వరకు నాననివ్వండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి సులభంగా వదిలిపోతుంది.

2 / 5
వెనిగర్: జిడ్డు మరకలను తొలగించడానికి వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో సమాన భాగాల్లో వెనిగర్ ,నీటిని కలపండి. దాన్ని బాగా షేక్ చేసి. ఈ ద్రావణాన్ని బర్నర్‌లపై స్ప్రే చేసి 15-20 నిమిషాలు పాటు అలాగే వదిలేయండి. తర్వాత స్క్రబ్బర్‌తో శుభ్రం చేసి నీటిలో కడిగేయండి. తర్వాత ఒక పొడి క్లాత్‌తో తుడిచేయండి అంతే. మీ స్టవ్‌ తలతల మెరిపోతుంది.

3 / 5
డిష్ వాష్ సోప్, వేడి నీరు: ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అందులో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ లేదా సోప్ వేయండి. బర్నర్‌లను ఈ నీటిలో 30 నిమిషాలు నానబెట్టి, ఆపై స్క్రబ్బర్‌తో రుద్దితే బర్నర్‌లు కొత్తవాటిలా మెరుస్తాయి.

4 / 5
వెనిగర్, బేకింగ్ సోడా : ఎక్కువగా పేరుకుపోయిన మాడిపోయిన మరకల కోసం ఇది ఉత్తమ మార్గం. ఒక పాత్రలో సమాన పరిమాణంలో నీరు, వెనిగర్ కలిపి, అందులో బర్నర్‌లను రాత్రంతా లేదా 2-3 గంటల పాటు నానబెట్టండి. తర్వాత వాటిపై కొంచెం బేకింగ్ సోడా చల్లి, టూత్ బ్రష్‌తో రుద్దితే చాలూ క్షణాల్లో మొండి మరకలు మాయమవుతాయి.

5 / 5
నిమ్మకాయ,ఉప్ప : దీనిలో బర్నర్ క్లీన్ చేసేందుకు, ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి దానిపై కొంచెం ఉప్పు చల్లండి. తర్వాత దీనిని బర్నర్‌పై బాగా రుద్దండి. ఇది బర్నర్‌లోని జిడ్డును వదిలించి, అది కొత్తదానిలా మెరిసేలా చేస్తుంది. బర్నర్‌లను శుభ్రం చేసిన తర్వాత, వాటిని పూర్తిగా ఆరనిచ్చి ఆపై స్టవ్‌కు అమర్చండి. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మీ స్టవ్‌తో పాటు బర్నర్‌ మెరిసిపోవాల్సిందే.

Follow Us