రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి ఎక్కడుందంటే

|

May 18, 2024 | 3:48 PM

కాకులు దూరని కారడవి, చిమ్మ చీకటి వంటి అంటూ రకరకాల అడవులకు సంబంధించిన కథలు వింటూనే ఉన్నాం.. అయితే రాత్రి సమయంలో వెలుగులు చిందించే అడవి గురించి మీకు తెలుసా? చిమ్మ చీకటిలో మిణుగురు వెదజల్లే అందాలతో కనువిందు చేసే అడవులు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఈ ప్రదేశం భీమశంకర్ వన్యప్రాణుల రిజర్వ్ అటువంటి ప్రదేశం. ఈ అడవులో సరి కొత్త అందాలను చూడవచ్చు. దీని అందం పగటి సమయంలో చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అదే విధంగా రాత్రి సమయంలో దృశ్యం చూడదగినదిగా ఉంటుంది.

1 / 5
అడవిలో మిణుగురల కాంతి మాత్రమే కాదు.. అడవిలో మొక్కలు కూడా ప్రకాశిస్తాయి. ముఖ్యంగా రుతుపవనాలు ఎంట్రీ సమయంలో వర్షాల పడే ప్రారంభం సమయంలో అడవిలో ప్రకాశం చాలా రెట్లు పెరుగుతుంది. కనుక ఎవరైనా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలను సందర్శించాలనుకుంటున్నట్లయితే ఈ ప్రదేశాన్ని తప్పనిసరిగా సందర్శించండి.

2 / 5
ఒక మాయా ప్రపంచం: వర్షాకాలంలో ఇక్కడ భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. రాత్రి వేళ ఈ అడవి మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. ఎక్కడో చెట్టు కాండం మీదనో, ఎక్కడో పొద మధ్యలోనో, ఎక్కడో చెట్టు మీద నుంచి రాలిన ఆకుల కుప్పల మీదనో లైట్ మెరుస్తూ ఉండడం చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఈ అడవిలో రాత్రిపూట మెరుస్తున్నది ఏమిటి? ఇది మాయా ప్రపంచంలో భాగమా?

3 / 5
మెరుస్తున్న పుట్టగొడుగు: నిజానికి ఈ అడవిలో మెరుస్తుండడంలో ఎలాంటి మాయాజాలం లేదు. భీమశంకర్ వన్యప్రాణుల రిజర్వ్ రాత్రి చీకటిలో మెరిసిపోవడానికి కారణం మైసీనా ఫంగస్. ఇది ఒక రకమైన పుట్టగొడుగు. దీనిని చాలా సార్లు నాచు అని పొరబడతారు. ఈ అడవిలో దొరికే పుట్టగొడుగు. రాత్రి చీకటిలో మట్టి, ఆకుల కుప్పల మధ్య మెరుస్తూ కనిపిస్తుంది.

4 / 5
అది ఎలా ప్రకాశిస్తుందంటే:  ఈ పుట్టగొడుగు లూసిఫేరేస్ అనే ప్రత్యేక రకం ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. పుట్టగొడుగులో ఉండే లూసిఫెరిన్‌తో సంబంధానికి వచ్చినప్పుడు.. అది మెరుస్తూ ఉంటుంది. లూసిఫెరిన్ కాంతి ఉద్గార సమ్మేళనంగా పరిగణించబడుతుంది.

5 / 5
ఈ రెండు మూలకాల రసాయన చర్య వల్ల బయోలుమినిసెంట్ గ్లో ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులతో పోలిస్తే భీమశంకర్ రిజర్వ్‌లో బయోలుమినిసెంట్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య భీమాశంకర్ వన్యప్రాణుల రిజర్వ్‌ను సందర్శించాలని ప్లాన్ చేసుకోండి.