
ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తుంటాము ఇది వెనుకటి నుంచి వస్తున్న ఆచారం నేటికీ ఎంతో మంది ఆ రోజున బాలాజీ టెంపుల్ కి వెళ్ళి నైవేద్యం పెట్టి కోరికలు కోరుకుంటారు. ఆయనకు ఎంతో ఇష్టమైన పాల పొంగళ్ళు ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

పాల పొంగళ్ళు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, నాలుగు కప్పుల పాలు, రెండు కప్పులు నీరు , ఒక కప్పు బెల్లం , మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 బాదం పప్పులు, 10 జీడీ పప్పులు, 10 కిస్మిస్ లు, ఇంకా టేస్ట్ కోసం పచ్చి కర్పూరం కొద్దిగా వేసుకోవాలి. ఈ నైవేద్యాన్ని సరైన కొలతలతో చేయాలి.

పాల పొంగళ్ళు రెసిపీకి తయారీ విధానం: మీరు ముందుగా బియ్యాన్ని తీసుకుని వాటిని కనీసం నాలుగు సార్లు బాగా కడిగి 15 నిమిషాలు పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఇంకోదానిలో ఒక గిన్నెలో పాలు, ఒక గ్లాస్ నీరు వేసి బాగా మరిగించాలి. అయితే, పాలను బాగా మరిగించాలి. అప్పుడే బియ్యం కూడా ఉడుకుతాయి. ఇది అస్సలు మర్చిపోకండి.

ఆ తరవాత ఇవి మరిగిన తర్వాత దానిలో బియ్యం వేసి ఉడికించాలి. ఇక బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత దానిలో బెల్లం వేసి కలపాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తరవాత దీన్లో నెయ్యి కూడా వేయాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే కొద్దిగా పచ్చి కర్పూరం కూడా వేసి దీనిలో బాగా కలపాలి.

ఇప్పుడు మళ్ళీ ఇంకో చిన్న పాన్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి చేసి అది బాగా వేడయ్యాక దానిలో నాలుగు జీడిపప్పు, ఇంకా కిస్మిస్ కూడా వేసి బాగా వేయించి పొంగల్లో కలపాలి. దీనిని వేడివేడిగా సర్వ్ చేసి తింటే టేస్ట్ ఉంటుంది. ఇలా చేసి స్వామి వారు వద్ద నైవేద్యంగా పెట్టండి.